Bigg Boss Telugu 8: ‘సెల్ఫ్ ఎలిమినేషన్’ అయ్యినందుకు మణికంఠ కి బిగ్ బాస్ భారీ జరిమానా..? ఎన్ని లక్షలు చెల్లించాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయితే పర్వాలేదు కానీ, ఒక కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటే మాత్రం పాతిక లక్షల రూపాయిల జరిమానా బిగ్ బాస్ టీం కి కట్టాల్సి ఉంటుంది. ఇది కచ్చితమైన నియమం.

Written By: Vicky, Updated On : October 21, 2024 12:00 pm

Bigg Boss Telugu 8(121)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆడియన్స్ కి ఇష్టం లేనివి జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. హౌస్ లో కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడని భావించిన నాగ మణికంఠ ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే ఆయన ఆడియన్స్ ఓట్ల ద్వారా కాదు, స్వయంగా ఎలిమినేట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఎవరినీ ఈ విషయంలో తప్పుపట్టలేము. కానీ బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపే ముందు కొన్ని ఒప్పందాలు చేసుకుంటుంది. ఆ ఒప్పందాలను ఉల్లంగించేందుకు వీలు లేదు, కచ్చితంగా పాటించాల్సిందే, లేకపోతే జరిమానా విధించడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివి జరుగుతుంది. ఇప్పుడు మణికంఠ బిగ్ బాస్ టీం నుండి అలాంటివే ఎదురుకోబోతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయితే పర్వాలేదు కానీ, ఒక కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటే మాత్రం పాతిక లక్షల రూపాయిల జరిమానా బిగ్ బాస్ టీం కి కట్టాల్సి ఉంటుంది. ఇది కచ్చితమైన నియమం. ఆరోగ్య సమస్యల కారణంగా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటే జరిమానా కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటే మాత్రం కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే. మణికంఠ చేసుకుంది సెల్ఫ్ ఎలిమినేషన్. ఈ నిర్ణయం బిగ్ బాస్ టీం కి ఆయన చెప్పినప్పుడు, వైద్య బృందం చేత వైద్య పరీక్షలు చేయించింది బిగ్ బాస్ టీం. రిపోర్ట్స్ లో నాగమణికంఠ కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిసింది. కాబట్టి మణికంఠ కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే. అయితే బిగ్ బాస్ కి మణికంఠ బోలెడంత కంటెంట్ ఇచ్చాడు, ఆయన లేకపోతే ఈ సీజన్ లేదు అనే విధంగా ఈ 7 వారాలు నడిచింది.

మానసిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు అని ఆయన చెప్పాడు కాబట్టి, దానిని పరిగణలోకి తీసుకొని బిగ్ బాస్ టీం దయచూపిస్తే జరిమానా కట్టే అవసరం రాకపోవచ్చు. గతంలో గంగవ్వ కూడా సీజన్ 4 లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక సెల్ఫ్ ఎలిమినేషన్ కి మొగ్గు చూపించింది. అప్పుడు బిగ్ బాస్ టీం ఆమెకు ఎలాంటి జరిమానా విధించలేదు. పైగా రిటర్న్ గిఫ్ట్ గా ఆమెకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చింది. నాగార్జున కూడా ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి 7 లక్షల రూపాయలకు పైగా ఆర్ధికసాయం అందించాడు. మణికంఠ విషయం లో కూడా ఆ జాలి చూపిస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే గంగవ్వ ముసలావిడ, ఆమెని షోకి ఎంచుకోవడమే అప్పట్లో ఒక ప్రయోగం, అందుకే ఆమె పట్ల అంతటి జాలీ, ప్రేమ చూపించారు. కానీ మణికంఠ కి చూపించడం కష్టమే కాబట్టి, భవిష్యత్తులో ఆయన ఎలాంటి పరిణామాలు ఎదురుకోబోతున్నాడో చూడాలి.