https://oktelugu.com/

Chiranjeevi : వింటేజ్ చిరంజీవిని చూపించడానికి 3 స్టార్ డైరెక్టర్స్ సిద్ధం అవుతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2024 / 09:57 AM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు ముందు వరుసలో ఉంటున్నారు… ఇక మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది కొందరికి మాత్రమే దక్కుతుంది. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లందరు చిరంజీవితో సినిమా చేయాలనే ఉత్సాహన్ని చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం కొందరికి మాత్రమే ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కుతుంది…

    ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ను చేస్తూ రోటీ కథలకంటే చాలా భిన్నంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ‘బింబిసార ‘ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వశిష్ట విశ్వంభర సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాని మార్చ్ లో రిలీజ్ చేయడానికి చిరంజీవి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండడంతో చిరంజీవి కూడా తనకు వీలైనన్ని డేట్స్ ని ఈ సినిమా మీద కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఆయన ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో మొదట అనిల్ రావిపూడి తో ఒక కమర్షియల్ సినిమాని చేయాలని చూస్తున్నాడు. అది గ్యాంగ్ లీడర్ టైప్ లో ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి అనిల్ రావిపూడి ఇప్పటికే వింటేజ్ చిరంజీవి ని చూపిస్తానని మాటిస్తున్నాడు…

    ఇక ఈ సినిమా తర్వాత దసర సినిమాతో మంచి విజయాన్ని సాధించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నాను అంటూ రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మరి ఆ ఆనౌన్స్మెంట్ కు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల వింటేజ్ చిరంజీవిని చూపిస్తానని ఆయన అభిమానులకు మాటిచ్చాడు. మరి దానికి అనుగుణంగానే చిరంజీవిని చూపిస్తాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…ఇక వీళ్లిద్దరి తర్వాత సందీప్ రెడ్డి వంగ రంగంలోకి దిగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేస్తున్నాను అంటు అఫీషియల్ గా చిరంజీవి అనౌన్స్ చేయనప్పటికి ఈ సినిమా తప్పకుండా ఉంటుందని చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక స్వతహాగా సందీప్ రెడ్డి వంగ చిరంజీవి ఫ్యాన్ అవ్వడం వల్ల అప్పుడు ఎలాగైతే చిరంజీవి ని చూడాలనుకున్నాడో ఇప్పుడు తన సినిమాతో కొత్త లుక్ ని తీసుకొచ్చి వింటేజ్ చిరంజీవిని చూపించడానికి తను సిద్ధంగా ఉన్నానని చెబుతుండటం విశేషం…