https://oktelugu.com/

Bigg Boss Telugu 8: తన గొయ్యి తానే తీసుకున్న అభయ్..ఓటింగ్ లో ఆయన ఏ స్థానంలో ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

నిన్న బిగ్ బాస్ క్లాన్స్ చీఫ్స్ గా ఉన్నటువంటి నిఖిల్, అభయ్ లను మీరిద్దరూ మాట్లాడుకొని ఎవరు నామినేట్ అవుతారో బిగ్ బాస్ కి చెప్పండి అంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటారు, నిఖిల్ నేను నామినేట్ అవుతానులే ఏమి పర్వాలేదు అని ముందుకు వెళ్తుంటే, అభయ్ ఒద్దు నేనే వెళ్తాను అంటూ పోటీ పడి మరీ తనని తాను నామినేట్ చేసుకున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 17, 2024 / 02:54 PM IST

    Bigg Boss Telugu 8(20)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఊహించినట్టుగానే ట్విస్టులతో ముందుకు సాగుతుంది. టాస్కుల విషయంలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ విషయంలో మాత్రం ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరేలా చేస్తున్నారు. గత వారం శేఖర్ బాషా ని ఎలిమినేట్ చేయడం అందరికీ చాలా అన్యాయంగా అనిపించింది. ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా కాకుండా, కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా శేఖర్ బాషా ని ఎలిమినేట్ చేసారు. ఆదిత్య ఓం కి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చినా హౌస్ లోనే ఉన్నాడు. ఇంత అన్యాయమైన ఎలిమినేషన్ ఏ సీజన్ లో కూడా ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేసే వారిని సీక్రెట్ హౌస్ లోకి పంపిస్తారు, కానీ ఇక్కడ అది కూడా జరగలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయినవారిలో అభయ్ నవీన్ కూడా ఉన్నారు.

    నిన్న బిగ్ బాస్ క్లాన్స్ చీఫ్స్ గా ఉన్నటువంటి నిఖిల్, అభయ్ లను మీరిద్దరూ మాట్లాడుకొని ఎవరు నామినేట్ అవుతారో బిగ్ బాస్ కి చెప్పండి అంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటారు, నిఖిల్ నేను నామినేట్ అవుతానులే ఏమి పర్వాలేదు అని ముందుకు వెళ్తుంటే, అభయ్ ఒద్దు నేనే వెళ్తాను అంటూ పోటీ పడి మరీ తనని తాను నామినేట్ చేసుకున్నాడు. ఒకవేళ నామినేట్ అయినా జనాలు నన్ను సేవ్ చేస్తారు, నేను నామినేషన్స్ నుండి తప్పించుకుంటాను అనే నమ్మకం ఉందని బిగ్ బాస్ కి చెప్తాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, హౌస్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్ తమదైన మార్కుని క్రియేట్ చేసుకున్నారు. కానీ అభయ్ నవీన్ కి ఇప్పటి వరకు ఎలాంటి మార్కు క్రియేట్ అవ్వలేదు. ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు. నిన్న మొన్నటి వరకు నెగటివ్ గా ఉన్నటువంటి యష్మీ కూడా నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ తో పాజిటివ్ అయిపోయింది.

    కానీ అభయ్ నవీన్ కి మాత్రం ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పే కన్నింగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు జనాల్లో. ఇది ఆయనకీ బిగ్గెస్ట్ మైనస్ అయ్యింది. దీంతో నామినేషన్స్ లోకి వచ్చిన ఆయన డేంజర్ జోన్ లో ఉన్నాడు. సోషల్ మీడియా లో జరిగే పొలింగ్స్ ని ఆధారంగా తీసుకుంటే అభయ్ కి బాటమ్ టాప్ 2 లో స్థానం దక్కింది. ఈయన తర్వాతి స్థానం లో పృథ్వీ రాజ్ ఉన్నాడు. కానీ పృథ్వీ కి కర్ణాటక నుండి అధికారిక ఓటింగ్ లో భారీ స్థాయి లో ఓట్లు పడుతున్నాయి. కాబట్టి అతను ఈ వారం కూడా సేవ్ అవుతాడు. ఎలిమినేట్ అయితే కచ్చితంగా అభయ్ అవుతాడు అని సోషల్ మీడియా పొలింగ్స్ ద్వారా తెలుస్తుంది. మరి ఇక్కడ జరిగినట్టే అధికారిక పొలింగ్స్ లో కూడా జరుగుతుందా లేదా అనేది చూడాలి.