https://oktelugu.com/

Honda Elevate Apex : బ్లాక్ కలర్ స్కీం త్వరపడండి.. హోండా ఎలివేట్ అదిరిపోలా.. కొత్త కారు ఫీచర్స్ ఇవీ..

ప్రస్తుతం మార్కెట్లో కొత్త ఎలివేషన్ ఎడిషన్ ధర రూ. 12.86 లక్షలుగా నిర్ణయించారు. సాదారణ ఎలివేషన్ తో పోలిస్తే కొత్త ఎడిషన్ రూ. 15 వేలు ఎక్కువ. కానీ కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లోక ఉన్న ఎస్ యూవీలకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని

Written By:
  • Srinivas
  • , Updated On : September 17, 2024 / 02:56 PM IST

    Honda Elevate Apex Edition Car Features Overall Review

    Follow us on

    Honda Elevate Apex : కార్ల వినియోగం పెరుగుతున్న తరుణంలో కంపెనీలు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే నేటి జనరేషన్ కు అనుగుణంగా కొత్త టెక్నాలజీతో కూడుకున్న కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా హోండా కంపెనీకి చెందిన కొత్త కారు లాంచ్ అయింది. SUV వేరియంట్ లో కొత్త అపెక్స్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఎస్ యూవీలను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ కారణంగానే మారుతి నుంచి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లు సక్సెస్ అయ్యాయి. అయితే వీటికి పోటీ ఇచ్చేందుకు హోండా కంపెనీ కొత్త ఎడిషన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో ఇప్పటి తరానికి అనుగుణంగా ఫీచర్లను అమరుస్తూ.. ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉండేలా సెట్ చేశారు. అంతేకాకుండా ధర కూడా బడ్జెట్ కు అనుగుణంగా ఉండడంతో దీని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ హోండా కొత్త కారు ఎలా ఉందంటే?

    హోండా నుంచి సెడాన్ తో పాటు ఎస్ యూవీ కార్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి వరకు హోండా సిటీ, న్యూ అమేజ్ తో పాటు కుషాక్ వంటి కార్లు మంచి పేరు తెచ్చుకున్నాయి. వీటితో పాటు లేటేస్ట్ గా Elevate Apex Edittion తాజాగా మార్కెట్లోకి వచ్చింది. ఇందులో1.5 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ గేర్, 7 స్పీడ్ సీవీటి గేర్ బాక్స్ లనుు అమర్చారు. ఇది V, VX గ్రేడ్ లపై ఆధారపడి పనిచేస్తుంది.

    దీని ఇంటీరియర్ ఆకర్షణీయంగా ఉంటుంది. పియానో బ్లాక్ డోర్ గార్నిష్ ఇందులో చూడొచ్చు. సైన్ ఫ్రంట్ ఫెండర్, టెయిల్ గేట్ కూడా ఇందులో కనిపిస్తుంది. కొత్త డ్యూయెల్ టోన్ ఐవరీ, బ్లాక్ ఇంటీరియర్ కలర్ స్కీమ్ ఆకర్షిస్తుంది. సాధారణ ఎలివేట్ లో టాన్, బ్లాక్ కలర్ ఉంటుంది. కానీ కొత్త ఎలివేట్ ఎడిషన్ లో ఉన్న బ్లాక్ కలర్ స్కీమ్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. డ్యాష్ బోర్ట్, డోర్ ప్యాడ్ లపై టాప్ స్పెక్ జడ్ ఎక్స్ ట్రిమ్ లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కొత్త ఎలివేట్ లుకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది.

    ప్రస్తుతం మార్కెట్లో కొత్త ఎలివేషన్ ఎడిషన్ ధర రూ. 12.86 లక్షలుగా నిర్ణయించారు. సాదారణ ఎలివేషన్ తో పోలిస్తే కొత్త ఎడిషన్ రూ. 15 వేలు ఎక్కువ. కానీ కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లోక ఉన్న ఎస్ యూవీలకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆటోమోబైల్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇండియాలో హోండా ఎలివేషన్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

    హోండా 2024 ఎలివేట్ ఎడిషన్ ఎస్ యూవీ 15నుంచి 17 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. అయితే గ్రాండ్ లుక్ కోరుకునేవారితో పాటు స్పోర్ట్ కారు కోసం ఎదురుచూసేవారికి ఇది మంచి అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఫెస్టివెల్ సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా హోండా కారు కోరుకునేవారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.