Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఇప్పటికి 3 వారాలు పూర్తి అయ్యింది. ఈ మూడు వారాల్లో ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క ఎలాంటి కంటెంట్ ఇవ్వలేదు కానీ, శేఖర్ బాషా, అభయ్ మాత్రం బిగ్ బాస్ కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు. వీళ్లిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అందరూ అనుకున్నారు కానీ, ఇంత తొందరగా వెళ్ళిపోతారని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. అయితే శేఖర్ బాషా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు, కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యాడు. కాబట్టి ఈయన ఎప్పుడైనా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సీజన్ 8 మొత్తం ట్విస్టులతోనే ఉంటుందని ఇది వరకే నాగార్జున అనేక సార్లు చెప్పాడు. కాబట్టి ఏదైనా జరగొచ్చు.
ఇది ఇలా ఉండగా అభయ్ ఎలిమినేషన్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఒకవేళ అభయ్ ఎలిమినేట్ అవ్వకపోయుంటే సీజన్ కి చాలా మైనస్ అయ్యేది. ఎందుకంటే అభయ్ ఆట తీరు అంత దారుణంగా ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ ని అతను అన్న మాటలు ఇంతకు ముందు ఎవరూ అనలేదు, భవిష్యత్తులో ఎవరూ అనబోరు కూడా. ఇదంతా పక్కన పెడితే అభయ్ కి మణికంఠ అంటే మనసులో చాలా కోపం ఉంది అనే విషయం నిన్న మరోసారి అర్థం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత వారం జరిగిన గుడ్ల టాస్కులో అభయ్ క్లాన్ కి చీఫ్ గా తన బాధ్యతలు చక్కగా నిర్వర్తించకపోగా, కష్టపడి తన క్లాన్ సభ్యులు సంపాదించిన గుడ్లను చాలా తేలికగా వదిలేసాడు.దీనిని ఎవ్వరూ ప్రశ్నించలేదు, నాగ మణికంఠ ప్రశ్నించి పోరాడాడు. అప్పటి నుండి ఆయనకు మణికంఠ అంటే కోపం ఏర్పడింది. ఆ కోపాన్ని వెళ్లే ముందు చూపించాడు. గత వారం ప్రేరణ, విష్ణు మధ్య జరిగిన దోశ వివాదంలోకి మణికంఠ దూరి పెద్దది చేసాడు అనే అపవాదుని ఎదురుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ మళ్ళీ ప్రస్తావిస్తూ నేడు అభయ్ బయటకి వెళ్లే ముందు మణికంఠ కి బ్లాక్ రోజ్ ఫ్లవర్ ని అందించి ‘మొన్న దోశ మ్యాటర్ లో తలదూర్చావు కదా, ఇంకెప్పుడు అలా చేయకు, అది గుర్తు పెట్టుకోవాలనే ఈ నల్ల రోజా పువ్వుని ఇచ్చాను’ అని అంటాడు అభయ్.
వాస్తవానికి ఆ విషయం లో నాగ మణికంఠ తన తప్పేమి లేదని ఇప్పటికీ అనుకుంటూ ఉన్నాడు. ఆ అంశాన్ని రిపీట్ ఆయనకీ కోపం వచ్చేస్తుంది, కానీ అభయ్ బయటకి వెళ్తున్నాడు కదా అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ‘అలాగే’ అని బదులిస్తాడు మణికంఠ. సున్నితమైన ఈ అంశాన్ని వెళ్ళేటప్పుడు కూడా గుర్తు చేసాడంటే ఇతనికి మణికంఠ అంటే ఎంత కోపం ఉందో అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అభయ్ కి ఇంకా పొగరు తగ్గలేదు, జనాలు అతనికి తగిన బుద్ధి చెప్పారు అంటూ పోస్టులు పెడుతున్నారు.