Akkineni Nagarjuna: మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా కేసు వేసిన అక్కినేని నాగార్జున..క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్!

ఇప్పుడు మీడియాలో సెన్సేషనల్ గా మారింది. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏమిటంటే కేటీఆర్ నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్ మాల్ ని కూల్చేయబోతుంటే, ఆ పని చేయొద్దు అంటూ నాగార్జున కేటీఆర్ కి రిక్వెస్ట్ చేస్తూ ఫోన్ చేయగా, కేటీఆర్ సమంత ని నా దగ్గరకు పంపిస్తే వదిలేస్తా అని అన్నాడని, ఆమె ఒప్పుకోకపోవడం తో నాగార్జున కుటుంబం సమంత చేత విడాకులు ఇప్పించారంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ.

Written By: Vicky, Updated On : October 3, 2024 5:37 pm

Akkineni Nagarjuna

Follow us on

Akkineni Nagarjuna: మంత్రి కొండా సురేఖ నిన్న అక్కినేని కుటుంబం పై, సమంత పై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసి అబాసుపాలైన సంగతి అందరికీ తెలిసిందే. బీ గ్రేడ్ షోస్ లో కూడా వినలేని మాటలు ఒక మంత్రి హోదాలో ఉన్నతివంటి స్త్రీ నుండి రావడం అత్యంత అవమానకరం. దీనిపై కచ్చితంగా న్యాయపరమైన పోరాటం చేయడమే ఉత్తమం. అందుకే అక్కినేని నాగార్జున నేడు ఆమెపై పరువు నష్టం దావా కేసు వేసాడు. కాసేపటి క్రితమే ఆయన నాంపల్లి హై కోర్టులో ఈ పిటీషన్ దాకా చేసాడు. మంత్రి తమ కుటుంబసభ్యుల గౌరవ మర్యాదలు మరియు పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యానించారని. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా నాగార్జున ఆ దావాలో పేర్కొన్నాడు.

ఇది ఇప్పుడు మీడియాలో సెన్సేషనల్ గా మారింది. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏమిటంటే కేటీఆర్ నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్ మాల్ ని కూల్చేయబోతుంటే, ఆ పని చేయొద్దు అంటూ నాగార్జున కేటీఆర్ కి రిక్వెస్ట్ చేస్తూ ఫోన్ చేయగా, కేటీఆర్ సమంత ని నా దగ్గరకు పంపిస్తే వదిలేస్తా అని అన్నాడని, ఆమె ఒప్పుకోకపోవడం తో నాగార్జున కుటుంబం సమంత చేత విడాకులు ఇప్పించారంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ. దీనిపై సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా తీవ్ర స్థాయిలో స్పందించి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని ఇలా ఎంతో మంది ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ కూడా సమంత కు క్షమాపణలు చెప్తూ, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని మీడియా ముఖంగా తెలిపింది. కానీ ఆమె నాగార్జున కుటుంబానికి మాత్రం ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. వాస్తవానికి ఆమె సమంత పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాగార్జున, నాగ చైతన్య క్యారెక్టర్స్ ఎంత నీచంగా ఉన్నాయో చూడండి అన్నట్టుగానే ఆమె మాట్లాడింది.

కానీ కొండా సురేఖ క్షమాపణలు చెప్పాల్సిన వారికి చెప్పకుండా చాలా తేలికగా తప్పించుకుంది. ఈ విషయమే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశ్నించాడు. ఆయన మాట్లాడుతూ ‘కొండా సురేఖ గారు సమంత కి క్షమాపణలు చెప్పడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అక్కడ ఆమె అత్యంత హీనంగా మాట్లాడింది నాగార్జునని, నాగ చైతన్యని. ఇండస్ట్రీ లో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు, ఇలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పేలా ఎదో ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలి’ అంటూ రామ్ గోపాల్ వర్మ నాగార్జున, నాగ చైతన్య ని ట్యాగ్ చేసి ట్వీట్ వేసాడు. కొండా సురేఖ అక్కినేని కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడం వల్లే ఏమో నాగార్జున నేడు పరువు నష్టం దావా వేసాడు. మరి ఆమెపై కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఆమె క్షమాపణలు చెప్తే నాగార్జున తన కేసు ని వెనక్కి తీసుకుంటాడా లేదా అనేది కూడా చూడాలి.