Siri Hanmanth: సిరి హన్మంతు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మార్మోగిపోతోంది. బిగ్ బాస్ టాప్-5లో చోటు దక్కించుకున్న సిరి.. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయంది. కాగా ఎలిమినేషన్ తర్వాత మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరితో మాట్లాడింది. అయితే ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది సిరి. షణ్ముక్, శ్రీహాన్ లతో ఉన్న రిలేషన్, సన్నీతో వివాదాల్లాంటి అనేక విషయాలను పంచుకుంది ఈ భామ. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో తాను టాప్-5 వరకు రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ సిరి పేర్కొంది. తాను విన్నర్ కావాలనే తపనతోనే ఆడానని, కానీ తనకు గెలిచే అంత సత్తా లేదని ఓపెన్ గానే పేర్కొంది సిరి. ఇకపోతే తాను ఎవరితో అయినా సరే ఎమోషనల్‌గా రిలేషన్ పెంచుకుంటే వారికోసం ఎంత అయినా చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు హౌస్ లో షణ్ముఖ్, జెస్సీ అలాగే యాంకర్ రవి.. ఈ ముగ్గురితో మంచి రిలేషన్ ఉన్నట్టు వివరించింది.
తనను రవి చెల్లెలుగా భావిస్తాడని, అతనంటే చాలా ఇష్టం అని పేర్కొంది. రవి ఎలిమినేట్ కావడం తనను బాధించిందని, అది కూడా తానే నామినేట్ చేయడం ఇంకా బాధనిపించిందంటూ వివరించింది. అయితే అంతకు ముందు రోజు తనతో గొడవ పెట్టుకున్నందుకే తాను నామినేట్ చేయాల్సి వచ్చిందంటూ వివరించింది. ఇక షణ్ముఖ్ తో జెన్యూన్ రిలేషన్ ఉందని, ఇద్దరం ఒకరికొకరం సపోర్టు చేసుకున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. తాను షన్నుతో రిలేషన్ పెంచుకోకపోయినా టాప్-5లో ఉండేదాన్నంటూ వివరించింది.
Also Read: Srinu Vaitla: పాత సినిమాల సమ్మేళనమే నిజమైతే ఇక శ్రీనువైట్ల కష్టమే
ఇక తనకు సన్నీతో కూడా మంచి రిలేషన్ ఉందని, కాకపోతే ప్రతీ టాస్క్‌లో కూడా సన్నీతో విభేదాలు రావడంతో ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయానంటూ వివరించింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కావాలా లేదంటే షణ్ముఖ్ కావాలా అని అడిగితే మాత్రం తాను శ్రీహాన్ కావాలని చెప్తానంటూ కుండ బద్ధలు కొట్టేసింది. తనకు షణ్ముఖ్ మంచి ఫ్రెండ్ అని కానీ శ్రీహాన్ తో ఉన్న రిలేషన్ వేరంటూ చెప్పుకొచ్చింది. ఇక శ్రీహాన్ వదిలేస్తున్నావా అని అడిగినప్పుడు చాలా బాధగా అనిపించిందంట.
Also Read: Actor Gopi Chand: హ్యాట్రిక్ కాంబినేషన్ తో వస్తున్న గోపిచంద్ – డైరెక్టర్ శ్రీవాస్…