Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి... బుద్దా అరుణకి కారు...

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి… బుద్దా అరుణకి కారు బహుమతి

Megastar Chiranjeevi: అంత‌ర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ వేదిక‌పై సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి స్పెషల్ గిఫ్ట్ అందింది. మాజీ బీసీసీఐ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వర నాథ్‌ కియా కారును అరుణ రెడ్డికి బహుమతిగా ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవీ, కాకినాడ పోర్టు చైర్మెన్ కేవీ రావులు చేతుల మీదుగా అరుణారెడ్డికి కారు కీ ని అంద‌జేశారు. ఇటీవ‌లే మోకాలి స‌ర్జరీ నుంచి కోలుకున్న అరుణా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాలు సాధించ‌డం విశేషం. ఇంత‌కు ముందు 2018 ప్ర‌పంచ జిమ్నాస్టిక్ ఛాంపియ‌న్‌షిప్‌లో అరుణ రెడ్డి కాంస్య పతాకం సాధించింది. మోకాలి సర్జరీ తర్వాత ఈ మధ్యే జిమ్నాస్టిక్స్ కి రీఎంట్రీ ఇచ్చింది అరుణ.

Megastar Chiranjeevi
gymnastic player aruna reddy rewarded with kia car by Megastar Chiranjeevi

Also Read: ఆర్‌ఆర్‌ఆర్ తో కలిసిన మరో ఆర్… వైరల్ గా మారిన ఫోటో

25 ఏళ్ల అరుణ ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌ కైరోలో జరిగిన ఫారోస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్టిక్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో రెండు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ సాధించింది. హోరాహోరీగా సాగిన వాల్ట్​ ఫైనల్లో అరుణ 13.487 స్కోరుతో టాప్​ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధించింది. 0.04 తేడాతో గోల్డ్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకుంది. ఇక, ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అరుణ 12.37 స్కోరుతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో ఇంకో గోల్డ్‌‌‌‌‌‌‌‌ని తన ఖాతాలో వేసుకుంది. 2018 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ నెగ్గి హిస్టరీ క్రియేట్​ చేసిన అరుణ… 2019 నవంబర్‌‌‌‌‌‌‌‌లో మోకాలికి సర్జరీ కావడంతో కొంతకాలం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి అరుణను అభినందించారు. దేశం కోసం మరిన్ని పథకాలు సాధించి రాష్ట్రానికి గర్వంగా నిలవాలని కోరారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: సాలిడ్ లైన్ అప్ తో రెడీ అవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular