https://oktelugu.com/

‘బిగ్ బాస్ సీజన్ 4’ కంటెస్టెంట్స్ వీళ్ళే !

‘బిగ్ బాస్ షో’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కానీ నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిగ్ బాస్ 2’ మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున చేస్తున్నారు. కాగా ఈ రోజుతో స్టార్ మా ఛానెల్లో షో స్టార్ట్ కానుంది. గత సీజన్ లోనూ హోస్ట్ గా చేసి షోకి టాప్ […]

Written By:
  • admin
  • , Updated On : September 6, 2020 / 02:49 PM IST
    Follow us on


    ‘బిగ్ బాస్ షో’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కానీ నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిగ్ బాస్ 2’ మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున చేస్తున్నారు. కాగా ఈ రోజుతో స్టార్ మా ఛానెల్లో షో స్టార్ట్ కానుంది. గత సీజన్ లోనూ హోస్ట్ గా చేసి షోకి టాప్ టీఆర్పీ రేటింగ్ ను అందించిన నాగార్జున, మళ్ళీ ఈ సారి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి రెడీ అయిపోయాడు.

    Also Read: థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా?

    ఇక ఈ సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారో అన్నది ప్రసుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న అప్ డేట్ ప్రకారం యూట్యూబ్ అవ్వగా తెలుగులో ఫుల్ ఫేమస్ అయిన గంగవ్వ, ఇద్దరు సినిమా డైరెక్టర్స్.. సత్యం సినిమా తీసిన సూర్య కిరణ్, హీరో గోపీచంద్ కి మొదటి హిట్ ఇచ్చిన రణం సినిమా డైరెక్టర్ ‘అమ్మ రాజశేఖర్’ కూడా ఈ షోకి రాబోతున్నాడు. అలాగే హారిక, మెహబూబ్, అలాగే స్మాల్ స్క్రీన్ నుంచి టీవీ 9 యాంకర్ గా ఎదిగిన దేవి, మరియు లాస్య కూడా షోలో పాల్గొనబోతున్నారు.

    Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

    అదే విధంగా బుల్లితెర ననటీనటుల నుండి సుజాత(జోర్దార్ షో), తనూజ(ముద్దమందారం), సైయద్ సోహాలి, అరియానా గ్లోరీలు కూడా షోకి వస్తున్నారు. మరికొంతమంది ప్రముఖులు కూడా షోకి రానున్నారు. ప్రముఖ నటుడు మరియు తెలుగు ర్యాప్ సింగర్ నోయెల్, నటి కరాటే కళ్యాణి మరియు మోనాల్ గజ్జర్ లు ఈ సారి షోలో అలరించనున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం కంటెస్టెంట్స్ వీరే అని తెలుస్తోంది. ఎలాగూ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు లైవ్ మొదలవుతుంది క్లారిటీ వస్తోంది అనుకోండి.