https://oktelugu.com/

హైకోర్టు మీ ఇష్టం అనేసినా… జగన్ మాకొద్దు అన్నాడు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు ఏమిటో అర్థమే కాదు. హైకోర్టు ఎన్నోసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసినా కూడా వాటిని పట్టించుకున్నదే లేదు. మూడు నాలుగు సార్లు చెబితేగాని సచివాలయం పై పార్టీ రంగులు తీయలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అపాయింట్ చేయమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా కోర్టు వారి మాట్లాడినప్పుడు మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు. విషయం ఏమిటంటే…. ప్రభుత్వ పథకాలలో ముఖ్యమంత్రితో పాటు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 6, 2020 / 02:30 PM IST
    Follow us on

    ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు ఏమిటో అర్థమే కాదు. హైకోర్టు ఎన్నోసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసినా కూడా వాటిని పట్టించుకున్నదే లేదు. మూడు నాలుగు సార్లు చెబితేగాని సచివాలయం పై పార్టీ రంగులు తీయలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అపాయింట్ చేయమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా కోర్టు వారి మాట్లాడినప్పుడు మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు.

    విషయం ఏమిటంటే…. ప్రభుత్వ పథకాలలో ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ఫోటోలు వేసుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్న కేసు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అందులో పిటిషనర్ తరఫు న్యాయవాది… వైఎస్ఆర్ ఫోటో ముద్రించడంతో పాటు పార్టీ రంగులు అద్దదాన్ని ప్రశ్నిస్తూ కోర్టు వారి ముందు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వైఎస్సార్ ఫోటో వేయడంలో అభ్యంతరం ఏముందని….? అతను కూడా సీఎం గా పని చేశారు కదా… అని కోర్టు వారు పిటీషనర్ ని ఎదురు ప్రశ్నించారు. 

    ఇందులో తమకు ఎక్కడ తప్పు కనిపించట్లేదని కోర్టు వారు మాట్లాడారు. అయితే ఇప్పుడు తాజాగా వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం వరుసగా రెండో రోజు కూడా అడ్వర్టైజ్మెంట్ జారీ చేసింది. ఈ ప్రకటనలో ఎక్కడా పార్టీ రంగులు కనపడలేదు. మామూలుగా అయితే ముఖ్యమంత్రి ఫోటోతో పాటు సంబంధిత మంత్రి ఫోటో కూడా ఉండడం సహజమే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఫోటోతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఫోటోలు కూడా కలుపుతూ వచ్చారు. కానీ ఈసారి జారీ చేసిన ప్రకటనలో మాత్రం ఎక్కడా వైఎస్ఆర్ ఫోటో కానీ…. పార్టీ రంగులు కానీ…. విద్యుత్ శాఖ మంత్రి ఫోటో కానీ కనబడలేదు. దీంతో జగన్ ధోరణి ఏమిటో అటు విపక్షాలకి, ఇటు కోర్టు వారికి అర్థం కావడం లేదు.