https://oktelugu.com/

ఆపరేషన్‌ ‘అడెళ్లు’..: అందుకేనా అడవుల్లో డీజీపీ మకాం?

మావోయిస్టులు అగ్రనేతలు లొంగిపోతున్నారని ఇటీవల వార్తలు రావడం.. అవన్నీ పోలీసుల కట్టుకథలు అంటూ మావోయిస్టు పార్టీ లేఖ రాయడం ఒకవిధంగా అందరిలోనూ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు లొంగిపోతున్నారా.. లేదా అనేది ఇంకా ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఇదిలా ఉండగా.. మారుమూల జిల్లా.. అందులోనూ ఏజెన్సీ ఏరియాలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌‌రెడ్డి నాలుగు రోజులు మకాం వేయడం సంచలనం రేపింది. అటు క్యాంప్‌ ఆఫీసు కాదు.. ఇటు ఇల్లు కాదు అన్నట్లుగా ఉన్న ఓ బిల్డింగ్‌లో డీజీపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 03:10 PM IST

    Telangana DGP Mahender reddy

    Follow us on


    మావోయిస్టులు అగ్రనేతలు లొంగిపోతున్నారని ఇటీవల వార్తలు రావడం.. అవన్నీ పోలీసుల కట్టుకథలు అంటూ మావోయిస్టు పార్టీ లేఖ రాయడం ఒకవిధంగా అందరిలోనూ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు లొంగిపోతున్నారా.. లేదా అనేది ఇంకా ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఇదిలా ఉండగా.. మారుమూల జిల్లా.. అందులోనూ ఏజెన్సీ ఏరియాలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌‌రెడ్డి నాలుగు రోజులు మకాం వేయడం సంచలనం రేపింది. అటు క్యాంప్‌ ఆఫీసు కాదు.. ఇటు ఇల్లు కాదు అన్నట్లుగా ఉన్న ఓ బిల్డింగ్‌లో డీజీపీ ఉండడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..? నక్సల్స్‌ కదలికలు ఏమైనా కనిపించాయా..? ఇంతవరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

    Also Read: గుడ్‌న్యూస్‌..: ప్రజలకు ఇక ఎమ్మార్వో, వీఆర్‌‌వోల వేధింపులుండవ్‌..

    మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు తమ ప్రాబల్యం చాటాలని చూస్తున్నారా..? పోలీసుల ఎత్తులకు పైఎత్తు చూపాలనే ఆలోచనకు వచ్చారా..? వీటిని పసిగట్టిన పోలీసులు వారిని దీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధులవుతున్నారా..? డీజీపీ నాలుగు రోజుల మకాం వెనక అందరికీ అదే అర్థం అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టులు మళ్లీ పుంజుకోకుండా ఉండేందుకే అక్కడ డీజీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఏరియల్‌ సర్వేలు.. జిల్లాల ఎస్పీలతో సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. శుక్రవారం రాత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తిర్యాణి పోలీసు స్టేషన్‌ను సడెన్‌గా తనిఖీ చేశారు. మంగీదళం, మావోయిస్టుల కదలికలపై ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు ఐజీ నాగిరెడ్డి కూడా నిర్మల్‌ ఏజెన్సీ ఏరియాలోని స్టేషన్లను సందర్శించారు. వీటికితోడు భూపలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోనూ పోలీసులు అలర్ట్‌ చేశారు.

    దీనికితోడు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌‌ ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌, స్థానిక కేడర్‌‌తో కలిసి ఆయన తన కార్యకలాపాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాజా సమాచారం ప్రకారం అడెళ్లును పట్టుకునేందుకు గ్రేహౌండ్స్‌ బలగాలు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అందుకే డీజీపీ నాలుగు రోజులుగా అక్కడ ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

    Also Read: కరోనా కాఠిన్యం: చెదిరిపోతున్న జర్నలిస్టులు

    కరోనాకు ప్రారంభం నుంచే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చకున్న మావోయిస్టులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారని.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పార్టీ విస్తరణకు అడెళ్లు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జూలై 15నాటి ఎదురుకాల్పుల తర్వాత కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో భాస్కర్‌ కదలికలు ఉన్నట్లుగా తెలియడంతో అతణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. వందలాది మంది గ్రౌహౌండ్స్ బలగాలు.. అడవులను, ఆదివాసీ గ్రామాలను జల్లెడపడుతున్నాయని, ఆడెళ్లు తలదాచుకుని ఉండొచ్చని భావిస్తున్న ప్రాంతాల్లో అణువణువూ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.