https://oktelugu.com/

Bala Krishna : చిరంజీవి పై బాలయ్య కి ఇంత పగనా..? పుట్టినరోజు నాడు కూడా ఇలా చేస్తాడని ఊహించి ఉండరు!

మెగా ఫ్యామిలీ లో ఇలా అందరితో బాలయ్య బాబు కి సాన్నిహిత్యం పెరిగింది కదా, కనీసం ఇప్పుడైనా చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియచేస్తాడని అభిమానులు ఆశించారు, కానీ అది జరగలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2024 / 09:17 PM IST

    Bala Krishna - Chiranjeevi

    Follow us on

    Bala Krishna :  నిన్నటి తరం హీరోలలో టాప్ 2 ఎవరు అని అడిగితే మన అందరికి గుర్తులకు వచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ. వీళ్లిద్దరి సినిమాలు పందేలలో పోట్లగిత్తలు లాగా పోటీ పడేవి. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా వీళ్లిద్దరి మధ్యనే దోబూచులు ఆడుతూ ఉండేవి. అయితే ఎంతటి పోటీ వాతావరణం ఉన్నా, కేవలం అది వృత్తి పరంగా మాత్రమే చూసేవారు కానీ, వ్యక్తిగతంగా ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు. బాలయ్య బాబు ని స్వయంగా తన తమ్ముడిలాగా భావిస్తాడు చిరంజీవి. అలాగే బాలయ్య కూడా ఇండస్ట్రీ లో నాకు ఉండే అతి తక్కువమంది మిత్రులలో ఒకరు చిరంజీవి అనే పలు సందర్భాలలో తెలిపాడు. అయితే వీళ్లిద్దరికీ ఈమధ్య ఎక్కడో చెడింది. బాలయ్య కొన్ని విషయాల్లో చిరంజీవి తీరుపట్ల అసహనం వ్యక్తం చేసిన వీడియోలను మనం చూడొచ్చు.

    కానీ చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు బాలయ్య మీద ఒక నెగటివ్ కామెంట్ చెయ్యడం కూడా మనం చూడలేదు. ఇప్పటికీ అదే సోదరభావం తో చూస్తాడు ఆయన. రెండేళ్ల క్రితం వరకు కూడా చిరంజీవి బాలయ్య పుట్టిన రోజు వచ్చినప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలియచేసేవాడు. కానీ బాలయ్య ఒక్కసారి కూడా వాటికి బదులుగా కృతజ్ఞతలు చెప్పడం ఇది వరకు మనం చూడలేదు. అంతే కాదు చిరంజీవి కి ఏ సంవత్సరంలో కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచెయ్యలేదు. ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఎంత పోటీ వాతావరణం ఉన్నప్పటికీ , నేటి తరం హీరోలు ఎంతో స్నేహభావం తో కలిసిమెలిసి ఉంటారు. అలాంటిది సీనియర్ హీరోలైన వీళ్లిద్దరు ఇలా ఎడమొహం, పెడమొహం వేసుకొని ఉండడం అభిమానులకు నచ్చడం లేదు. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగు దేశం కూటమి ప్రభుత్వం లో ఒక భాగం, ఆంధ్ర ప్రదేశ్ కి ఆయన ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు తో పవన్ కళ్యాణ్ కి ఎంతో సాన్నిహిత్యం ఉంది. బాలయ్య బాబు కూడా పవన్ కళ్యాణ్ తో ఎంతో స్నేహంగా ఉంటాడు. అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో కూడా బాలయ్య ఎంతో ఆప్యాయంగా పలకరించడం, స్నేహితుడిలాగా మాట్లాడడం వంటివి మనం ఎన్నో చూసాము.

    మెగా ఫ్యామిలీ లో ఇలా అందరితో బాలయ్య బాబు కి సాన్నిహిత్యం పెరిగింది కదా, కనీసం ఇప్పుడైనా చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియచేస్తాడని అభిమానులు ఆశించారు, కానీ అది జరగలేదు. ఇకపోతే సెప్టెంబర్ 1 వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ లో బాలయ్య బాబు ఇండస్ట్రీ లోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఈ ఈవెంట్ కి చిరంజీవి తో పాటు, టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అందరికీ ఆహ్వానం దక్కింది. మరి చిరంజీవి ఈ ఈవెంట్ కి హాజరు అవుతాడా లేదా అనేది చూడాలి.