https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: అర్ధరాత్రి ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన రతిక… వీడియో వైరల్!

బిగ్ బాస్ కనికరించి ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చాడు. హౌస్ లోకి తిరిగి వచ్చిన రతిక తనను ప్రూవ్ చేసుకోవడం మానేసి ముచ్చట్లు చెప్తుంది. గేమ్ పరంగా కూడా చాలా వీక్ అయిపోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2023 / 05:58 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి రోజే అందరి దృష్టిని ఆకర్షించింది. పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపి.. వెనుక తిప్పించుకుని తర్వాత నువ్వు ఎవడ్రా అంటూ వెన్నుపోటు పొడిచింది. తర్వాత యావర్ తో మరో ట్రాక్ నడిపింది. తను హౌస్ లోకి వెళ్ళాక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు లీక్ చేసి మరింత బ్యాడ్ అయింది. దీంతో ఫుల్ నెగిటివిటీ తో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.

    కానీ బిగ్ బాస్ కనికరించి ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చాడు. హౌస్ లోకి తిరిగి వచ్చిన రతిక తనను ప్రూవ్ చేసుకోవడం మానేసి ముచ్చట్లు చెప్తుంది. గేమ్ పరంగా కూడా చాలా వీక్ అయిపోయింది. ఎలిమినేట్ అవ్వక ముందు కంటెంట్ కోసం ఆడినా .. అప్పుడే కాస్త బాగా గేమ్ ఆడింది. రతిక రోజ్ గత రెండు వారాల నుంచి నామినేషన్స్ లో ఉంటుంది. కాగా గత వారం ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్ళింది. ఒక్క వారం చూడండి .. ప్లీజ్ ఎలిమినేట్ చేయకండి నాగార్జున సార్ అంటూ వేడుకుంది.

    ఇక ఈ వారం కూడా నామినేషన్స్ లో నిలిచి అతి తక్కువ ఓటింగ్ నమోదు చేసుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో రతిక ఒక పని చేస్తూ అడ్డంగా బుక్కైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రతిక ఆట తీరు.. ప్రవర్తన ఎలా ఉన్నాయి అని పక్కన పెడితే .. అందంలో ఆమెకు సాటి .. పోటీ హౌస్ లో ఎవరు లేరు. ఇక రతిక హెయిర్ చూస్తే నల్లగా .. ఒత్తుగా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్.. అది నిజమైన జుట్టు కాదు. రతిక విగ్ పెట్టుకుని మానేజ్ చేస్తుంది.అచ్చ తెలుగులో చెప్పాలంటే సవరం అన్నమాట.

    కాగా ఆమె రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత సవరాన్ని తీస్తున్న వీడియో లైవ్ ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయింది. ఈ వీడియో లో రతిక ముందు అటు ఇటు చూసింది.తర్వాత అద్ధం ముందుకు వెళ్లి సవరం తీస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వారం కూడా ఆమె నామినేషన్స్ లో ఉంది. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.