Odi World Cup 2023: పాకిస్థాన్ టీమ్ కి సవాలు విసిరిన ఇండియన్ మాజీ ప్లేయర్…

క్రికెట్ లో కెప్టెన్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.టీమ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయిన మొత్తం రెస్పాన్సిబిలిటీ కెప్టెన్ మీదే ఉంటుంది. కాబట్టి ఒక టీమ్ లో కెప్టెన్ అనే వాడు చాలా షార్ప్ గా ఉండాలి. ఏకకాలంలో ఆయన మైండ్ లో పది ఆలోచనలు రన్ అవుతూ ఉండాలి.

Written By: Gopi, Updated On : November 10, 2023 5:59 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: క్రికెట్ టీం లో 11 మంది ప్లేయర్లు ఆడుతూ ఉంటారు ఈ 11 మందిని ఏకతాటిపై నడిపించే వాడే కెప్టెన్…అయితే ఈ 11 మందిలోనుంచే నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్లు ఎవరు అనేది చూసుకొని అందులో నుంచే ఒక వ్యక్తిని కెప్టెన్ గా నిర్ణయించడం జరుగుతుంది. కెప్టెన్ అంటే నాయకుడు. టీముని ముందుండి నడిపించేవాడు. టీమ్ కి కష్టం వచ్చిన,నష్టం వచ్చిన అన్ని తనే చూసుకుంటాడు. ఇక తనతో పాటు తన టీమ్ ని వెంట పెట్టుకొని ప్రత్యర్థి టీమ్ పైన దండయాత్ర చేసి మ్యాచ్ లు గెలిచి దేశ గౌరవాన్ని నిలిపేవాడే కెప్టెన్…

క్రికెట్ లో కెప్టెన్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.టీమ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయిన మొత్తం రెస్పాన్సిబిలిటీ కెప్టెన్ మీదే ఉంటుంది. కాబట్టి ఒక టీమ్ లో కెప్టెన్ అనే వాడు చాలా షార్ప్ గా ఉండాలి. ఏకకాలంలో ఆయన మైండ్ లో పది ఆలోచనలు రన్ అవుతూ ఉండాలి. ప్రత్యర్థి కంటే ముందే వాళ్ళు వేసిన వ్యూహాలను తెలుసుకొని దానికి పై ఎత్తు వేయాలి…అలాగే పిచ్ లో మ్యాచ్ పొజిషన్ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసి సక్సెస్ సాధించాలి.ఇక ఇలాంటి లక్షణాలతో ఇండియా గర్వించదగ్గ కెప్టెన్ గా గుర్తింపు పొందిన వాళ్లలో ధోని ముందు వరుసలో ఉంటాడు. అయితే ఇప్పుడు ధోని ప్రస్తావని ఎందుకు వచ్చింది అంటే ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ వరుస ఓటములను అందుకుంటుంది.

ఇక ఇలాంటి టైం లో పాకిస్తాన్ టీమ్ పైన మన మాజీ ప్లేయర్ అయిన మనోజ్ తివారి కొన్ని కామెంట్లు చేశారు అవి ఏంటి అంటే పాకిస్థాన్ ప్లేయర్లందరు బాగా అడుతున్నప్పటికి ఆ టీం వరుసగా మ్యాచ్ లను ఓడిపోతుంది. దానికి కారణం ఆ టీమ్ కి కెప్టెన్ సరిగ్గా లేడు అందుకే ఈ టీమ్ వరుసగా ఓటములు చవి చూస్తుంది.ఇక బాబర్ అజమ్ కెప్టెన్ గా పనికిరాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా పేలవంగా ఉంటున్నాయి అలాగే ప్రత్యర్థిని అంచనా వేయడంలో అతను చాలా స్లోగా ఉన్నాడు ఇలా ఉంటే పాకిస్తాన్ కి వరల్డ్ కప్ కాదు కదా ఏ కప్పు రాదు. ఇంకా అలాగే ఇదే టీం కి ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని ని కెప్టెన్ గా చేసి చూడండి వరల్డ్ కప్ కొట్టి చూపిస్తాడు. నాయకుడు అంటే అలా ఉండాలి అంటూ మనోజ్ తివారీ పాకిస్థాన్ మీద ఒక సవాలు విసిరాడు.

అలాగే మీ టీం లో ఉన్న కెప్టెన్ బాబర్ అజమ్ మంచి ప్లేయర్ కానీ మంచి కెప్టెన్ కాదు అంటూ చెబుతూనే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను స్పష్టంగా తెలియజేశాడు.ముఖ్యంగా షాధబ్ ఖాన్ పాకిస్థాన్ టీమ్ లో వరుస మ్యాచ్ ల్లో ఫెయిలవుతున్నా షాదాబ్ ని పక్కన పెట్టి అతని ప్లేస్ లో ఇంకో ప్లేయర్ ని రీప్లేస్ చేయకుండా తనతోనే మ్యాచ్ లు అడిస్తున్నాడు దాని వల్ల ఆయన చాలా వరకు కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు అంటూ కామెంట్ చేశాడు. ఇక బాబర్ అజమ్ మీద విమర్శలు ఇప్పుడనే కాదు చాలా రోజుల నుంచి వస్తున్నాయి.

గత టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి వెళ్లి పాకిస్తాన్ ఓడిపోయింది. ఇక రీసెంట్ గా జరిగిన ఆసియా కప్ లో పాకిస్తాన్ సూపర్ 4 దశ లోనే వెను తిరిగింది. కనీసం ఫైనల్ కి కూడా రాలేకపోయింది. ఇక ఇప్పుడూ వరల్డ్ కప్ లో కూడా చాలా దారుణమైన పర్ఫామెన్స్ ఇస్తుంది.ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్ మీద ఓడిపోయి పాకిస్తాన్ టీం చాలా పెద్ద అవమానాన్ని మూట కట్టుకుంది.ఇక అప్పటినుంచి మాజీ ప్లేయర్లందరు కూడా పాకిస్తాన్ టీం ను విమర్శించడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజమ్ మీద చాలా విమర్శలు అయితే వస్తున్నాయి…