Guess Actress
Guess Actress: ఆమె కెరీర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మొదలైంది. లక్షల శాలరీ వచ్చే ఉద్యోగం ఉన్నా మనసు మాత్రం నటన మీదే. నటిగా ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. నటనలో శిక్షణ తీసుకుంది. నటిగా నిరూపించుకునేందుకు పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఆమె నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాగే ఆమెకు అవార్డులు రివార్డులు తెచ్చి పెట్టింది. పైన ఫోటోలో ఉన్న లిటిల్ కిడ్ ఇప్పుడు యంగ్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు అనన్య నాగళ్ళ.
నటి కావాలనే మక్కువతో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది వెండితెరకు పరిచయమైంది. 2019లో మల్లేశం టైటిల్ తో విడుదలైన బయోపిక్ లో అనన్య నాగళ్ల నటించింది. ప్రియదర్శి హీరోగా నటించాడు. కమర్షియల్ గా ఆడకున్నా మల్లేశం ప్రశంసలు అందుకుంది.
తర్వాత పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ లో ఛాన్స్ కొట్టేసింది. వకీల్ పింక్ మూవీ రీమేక్. కీలకమైన పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ నటించారు. వకీల్ సాబ్ సూపర్ హిట్ కొట్టింది. అనన్య కు మంచి రీచ్ వచ్చింది. వకీల్ సాబ్ విజయం సాధించినప్పటికీ అనన్యకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు.
సమంత-గుణశేఖర్ కాంబోలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలో ఓ రోల్ చేసింది. సమంత చెలికత్తెగా ఫుల్ లెంగ్త్ పాత్రలో అలరించింది. శాకుంతలం డిజాస్టర్ కావడంతో అనన్య కెరీర్ కి ఈ మూవీ ఉపయోగపడలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సోహైల్ కి జంటగా బూట్ కట్ బాలరాజు చేస్తుంది. అలాగే తంత్ర టైటిల్ తో మరో మూవీ చేస్తుంది. అడపాదడపా ఆఫర్స్ తప్పితే బ్రేక్ ఇచ్చే మూవీ పడటం లేదు.