Bigg Boss Punarnavi: మనది పేరుకే తెలుగు సినీ పరిశ్రమ ఇందులో హీరోలు తప్ప హీరోయిన్స్ తెలుగు వాళ్ళు చాలా తక్కువ అని చెప్పవచ్చు. తెలుగు అమ్మాయిలు ఇక్కడ అవకాశాలు తక్కువే అనే టాక్ ఉంది. ఇలాంటి స్థితిలో ఇద్దరు ముగ్గురు తెలుగు అమ్మాయిలు బాగానే కెరీర్ స్టార్ట్ చేసిన కానీ పెద్దగా నిలబడలేకపోయారు. ఇందులో పునర్నవి భూపాలం ఒకరు. చాలా ఏళ్ల క్రితం నటిగా ప్రయాణం మొదలుపెట్టిన కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పునర్నవి అందులో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి మంచి మార్కులు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘మనసుకు నచ్చింది’, ‘ఈ సినిమా సూపర్ హిట్’, ‘ఎందుకో ఏమో’ సహా చాలా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. వరసగా చిన్న చిన్న రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి చేసిన హడావిడి గురించి చెప్పాల్సిన పని లేదు. హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో రాహుల్ సిప్లిగంజ్ తో చాలా క్లోజ్ గా మూవీ అవుతూ ఉండేది. వారిని చూసి త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని టాక్ కూడా నడిచింది. కానీ అలాంటిది ఏమి జరగలేదు. రఘునందన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత అది ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ సిరీస్ పిక్ అని చెప్పింది. దీని తర్వాత పున్నూ ఫారెన్ వెళ్లిపోయింది.
ప్రస్తుతం సినీ రంగానికి దూరంగా ఉన్న కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఫారిన్ లో చదువుకుంటున్న ఈ అమ్ముడు రీసెంట్ గా బోల్డ్ ఫోటోలు అప్లోడ్ చేసింది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది. బహుశా ఇక ఆమె సినిమాల ను వదిలేసి, కెరీర్ లో స్థిరపడే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.