Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ షో అంటే తెలుగు ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక్కడకు ఎంత పెద్ద సెలబ్రిటీలు వచ్చినా సరే.. వారి ముఖం చూసి మాత్రం ఓట్లు పడవు. కేవలం వాడుతున్న ఆటను చూసి అలాగ వారి ఆటిట్యూడ్‌కు మాత్రమే ఓట్లు పడతాయి. అందుకే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వారు చాలా సార్లు ఫైనల్ వరకు వెళ్లగలిగారు.

అయితే ఆడియెన్స్ ఇంత నిజాయితీగా ఓట్లు వేస్తుంటే.. బిగ్ బాస్ మాత్రం కొన్ని సార్లు కావాలనే సమన్యాయం చేయట్లేదనే వాదన మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళల విషయాల్లో ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ లో కూడా ఇదే జరుగుతుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
Also Read: Megastar Chiranjeevi: వైరల్ : చిరంజీవి మాటలకు వేదికపైనే ఏడ్చేసిన నటుడు
గతంలో విన్నర్ విషయంలో జరిగినట్టే ఈ సారి కూడా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్ ప్రియులు. గతంలో జరిగిన ఐదు సీజన్ లు చూసుకుంటే.. మొదటి సీజన్ లో శివబాలాజీ విన్నర్ గా నిలిచాడు. రన్నరప్ గా ఆదర్శ్ బాలకృష్ణ ఉన్నాడు. వీరిపై పెద్దగా అనుమానాలు ఎవరికీ లేవు. కానీ రెండో సీజన్ లో కౌశల్ ఫ్యాన్స్ మొత్తం హోస్ట్ నానికి ఎదరు తిరిగి మరీ అతన్ని గెలిపించుకున్నారు.

అయితే రన్నరప్ గా గీత మాధురి గెలిచింది. ఇక్కడ గీతా మాధురి గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక మూడో శ్రీముఖి గెలుస్తుందని అంతా నమ్మకంతో ఉన్నారు. కానీ అనూహ్యంగా రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. నాలుగో సీజన్ లో అభిజిత్ గెలవగా.. అఖిల్ రన్నరప్ గా నిలిచాడు.

ఇక ఐదో సీజన్ లో అందరూ షణ్ముఖ్ గెలుస్తాడని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా సన్నీ గెలిచాడు. ఈ ఐదు సీజన్ లో చూస్తే మటుకు.. ముఖ్యంగా మహిళల విషయాల్లో కొంత సమన్యాయం జరగలేదనే వాదన అయితే ఉంది. ఇప్పటి వరకు ఐదు సీజన్‌లు జరగ్గా.. కేవలం రెండు సార్లు మాత్రమే మహిళలు రన్నరప్ గా నిలిచారు. కానీ టైటిల్ ను గెలుస్తుందనుకున్న శ్రీముఖి గెలవలేదు.
దీన్ని బట్టి బిగ్ బాస్ షోలో అమ్మాయిల పట్ల కొంత పక్షపాతం ఉందనే అనుమానాలు మొదటి నుంచి ఆడియెన్స్ నుంచి వస్తున్నాయి. మరి ఈ సారి ఓటీటీ వేదికగా వస్తున్న షోలో కూడా మొదటి నుంచి హీరోయిన్ బిందు మాధవి టైటిల్ ఫేవరెట్ గానిలుస్తోంది. నామినేషన్స్ జరిగిన ప్రతిసారి ఆమెకే టాప్ ఓటింగ్ వస్తోంది. ఇక ఆమెకు పోటీగా అఖిల్ కూడా గట్టిగానే ఉన్నాడు. ఈ ఇద్దరి విషయంలో బిగ్ బాస్ చాలాసార్లు సమన్యాయం చేయట్లేదని అంటున్నారు అభిమానులు. మరి ఈసారి కూడా బిందు మాధవికి టైటిల్ రాకపోతే మాత్రం.. బిగ్ బాస్ మీద ఉన్న అనుమానాలు నిజం అయ్యే ఛాన్స్ ఉంది.
Also Read:Shocking Story: పెళ్లయి 10రోజులైనా దగ్గరకు రానీయని భార్య.. ఆ వరుడికి అసలు నిజం తెలిసి షాక్