Bigg Boss Non Stop OTT Telugu: బిగ్ బాస్ షో నాన్ స్టాప్ గా ఓటీటీ వేదికగా అలరిస్తూనే ఉంది. గతం కంటే చాలా భిన్నమైన టాస్క్ లతో కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు వారాల సీజన్ లో ఎలాంటి చిత్రవిచిత్రమైన టాస్క్ లు పెట్టాడో మనం చూస్తున్నాం. ఇలాంటి సర్ ప్రైస్ టాస్క్ లే కాకుండా.. ఊహించని ఘటనలు కూడా జరుగుతున్నాయి. మొదటి నుంచి బిగ్ బాస్ లో నామినేషన్స్ ప్రక్రియనే చాలా టఫ్ గా ఉంటుంది.
హౌస్ లోకి 17 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. గడిచిన నాలుగు వారాల్లో ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, ఆర్ జె చైతు, సరయులు ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఐదోవారం నామినేషన్స్ టాస్క్ చాలా ఉత్కంఠగా నానా గొడవల మధ్య జరిగింది. ఈసారి స్వైప్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ ఇవ్వడంతో అషు రెడ్డి, మహేష్ విట్ట సేఫ్ అయ్యారు. ఇక ఈ స్వైప్ చేసుకునే ఆప్షన్ కారణంగా.. బిందు మాధవి, యాంకర్ స్రవంతి బలైపోయారు.
Also Read: Celebrities Arrested: రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు అరెస్ట్.. ఆ హీరో, ఆ నిర్మాత కూతురు కూడా
మొత్తంగా ఐదో వారం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. కాగా ఓటింగ్ ప్రక్రియ చూస్తే టాప్ ప్లేస్ లో బిందు మాధవి, సెకండ్ యాంకర్ శివ ఉన్నారు. ఆ తర్వాత అరియానా, అనిల్ రాథోడ్ లు ఉన్నారు. వీరంతా సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ ప్రక్రియని చూస్తుంటే ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. తేజస్వి మదివాడ, మిత్రశర్మ, యాంకర్ స్రవంతి చివరి స్థానాల్లో కొనసాగుతున్నారు.
వాస్తవంగా ఓటింగ్ ప్రక్రియ ప్రకారం.. స్రవంతి ఎలిమినేట్ అవుతారని అంతా అనుకుంటున్నారు. కానీ బుల్లితెర నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ శనివారమే అయిపోయిందట. ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దీంతో అందరూ షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ పోలింగ్ ప్రకారం తేజస్వి సేఫ్ జోన్ లోనే ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఓటింగ్ ప్రక్రియ ప్రకారమే ఎలిమినేట్ చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:Megastar Chiranjeevi: వైరల్ : చిరంజీవి మాటలకు వేదికపైనే ఏడ్చేసిన నటుడు