Celebrities Arrested: రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు అరెస్ట్.. ఆ హీరో, ఆ నిర్మాత కూతురు కూడా

Celebrities Arrested: అర్ధరాత్రి రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయ్యారు కొందరు సినీ ప్రముఖులు, అలాగే కొందరు ప్రముఖుల వారసులు. బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు సడెన్ గా ఆ హోటల్‌ పై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో ప్రముఖ నటుడు, నిర్మాత కూతురు, ఓ నటి కుమార్తె, మరియు బిగ్‌ బాస్ తెలుగు విజేత – ప్రముఖ సింగర్ రాహుల్ […]

Written By: Shiva, Updated On : April 3, 2022 12:10 pm
Follow us on

Celebrities Arrested: అర్ధరాత్రి రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయ్యారు కొందరు సినీ ప్రముఖులు, అలాగే కొందరు ప్రముఖుల వారసులు. బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు సడెన్ గా ఆ హోటల్‌ పై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో ప్రముఖ నటుడు, నిర్మాత కూతురు, ఓ నటి కుమార్తె, మరియు బిగ్‌ బాస్ తెలుగు విజేత – ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే కొందరు బడా బాబుల పిల్లలు అడ్డంగా బుక్ అయ్యి.. నేటి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

Celebrities Arrested

పైగా ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్ దొరికాయి. దీనికితోడు సమయానికి మించి పుడింగ్ మింక్ పబ్‌ నడుపుతున్నారు. దాంతో పబ్ యజమానులతో సహా 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పబ్ ఒక మాజీ ఎంపీ కూతురుది అని తెలుస్తోంది. అయితే, అరెస్టయిన వారిలో సినీ ప్రముఖులతో పాటు బడా బాబుల పిల్లలు కూడా ఉండటంతో పోలీసులు వివరాలు పూర్తిగా బయట పెట్టడం లేదు.

Also Read: Megastar Chiranjeevi: వైరల్ : చిరంజీవి మాటలకు వేదికపైనే ఏడ్చేసిన నటుడు

తమ వివరాలు పూర్తిగా బయట పెట్టకపోయినా, పబ్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ లో ఆ ప్రముఖుల వారసులు హడావుడి చేస్తూ హంగామా సృష్టించారు. తమను ఎందుకు తీసుకువచ్చారంటూ గొడవకు దిగారు. విచారణ అనంతరం పోలీసులు కొందరిని విడిచిపెట్టారు.

Celebrities Arrested

తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు దాడులు నిర్వహించడం.. ఉదయం 5 గంటల సమయంలో కొందర్ని విచారించి విడిచి పెట్టడం జరిగింది. అయితే.. అరెస్ట్ అయిన ప్రముఖుల్లో స్టార్ హీరోల బ్రదర్, నటుడు మరియు షోలకు జడ్జ్ అయిన ఓ ప్రముఖ వ్యక్తి కుమార్తె కూడా ఉందట. ఆమెకు ఇప్పటికే పెళ్లి అయ్యింది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఈ పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది.

అలాగే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కుమార్తె కూడా ఈ పార్టీలో ఉంది. భర్తను పోగొట్టుకున్న తర్వాత ఆ నటి తన కుమార్తెతో కలిసి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె కూతురికి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఇలా రేవ్ పార్టీలో బుక్ అవ్వడం బాధాకరం.

Also Read:Chiranjeevi- Renu Desai: ఎదురుపడ్డ చిరంజీవిని చూసి రేణుదేశాయ్ షాకింగ్ రియాక్షన్

Tags