https://oktelugu.com/

Bigg Boss OTT Telugu Sravanthi: బిగ్ బాస్ హౌస్ పూల్ లో ప‌డ్డ స్ర‌వంతి.. ఈత రాక మునిగిపోతుంటే చివ‌ర‌కు..

Bigg Boss OTT Telugu Sravanthi: ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌ని టాస్క్‌లు, ట్విస్టులు మ‌ధ్య మ‌ధ్య‌లో గొడ‌వ‌లు అన్నీ కూడా మ‌న‌కు బిగ్ బాస్ హౌస్ లోనే క‌నిపిస్తాయి. కాగా ఇప్పుడు ఓటీటీలో నాన్ స్టాప్ ఎంట‌ర్ టైన్ మెంట్ అంటూ వ‌స్తున్న ఈ షో రోజు రోజుకూ ర‌క్తి క‌డుతోంది. బోల్డ్ నెస్ ఓవ‌ర్ లోడెడ్ అన్న‌ట్టు మాట‌ల ఘాటు పెరుగుతోంది. లవ్ ట్రాకులు, రొమాన్స్ కూడా బాగానే న‌డుస్తోంది. ప్ర‌స్తుతం హౌస్ లో సీనియ‌ర్స్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 11, 2022 / 01:14 PM IST
    Follow us on

    Bigg Boss OTT Telugu Sravanthi: ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌ని టాస్క్‌లు, ట్విస్టులు మ‌ధ్య మ‌ధ్య‌లో గొడ‌వ‌లు అన్నీ కూడా మ‌న‌కు బిగ్ బాస్ హౌస్ లోనే క‌నిపిస్తాయి. కాగా ఇప్పుడు ఓటీటీలో నాన్ స్టాప్ ఎంట‌ర్ టైన్ మెంట్ అంటూ వ‌స్తున్న ఈ షో రోజు రోజుకూ ర‌క్తి క‌డుతోంది. బోల్డ్ నెస్ ఓవ‌ర్ లోడెడ్ అన్న‌ట్టు మాట‌ల ఘాటు పెరుగుతోంది. లవ్ ట్రాకులు, రొమాన్స్ కూడా బాగానే న‌డుస్తోంది.

    Bigg Boss OTT Telugu Sravanthi

    ప్ర‌స్తుతం హౌస్ లో సీనియ‌ర్స్ వ‌ర్సెస్ జూనియ‌ర్స్ అన్న‌ట్టు గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఇక ఈ వారం కెప్టెన్సీ కోసం తగ్గేదేలే టాస్క్ ను బిగ్ బాస్ వారికి ఇచ్చాడు. ఇక్క‌డే చాలా దారుణం జ‌రిగిపోయింది. వారియర్స్ టీం మెంబ‌ర్స్ ఈ టాస్క్ లో స్మ‌గ్లర్లుగా న‌టిస్తే.. ఛాలెంజర్స్ టీమ్ మెంబ‌ర్లు మాత్రం పోలీసులుగా న‌టించారు. పోలీసులకు తెలియ‌కుండా ఇంట్లో ఉన్న కొన్ని బొమ్మల్ని చెక్‌పోస్ట్ అవ‌త‌లికి తీసుకెళ్ల‌డ‌మే దీని ఉద్దేశ్యం.

    Also Read:  ఆ హీరోయిన్ తో దుబాయ్‌ లో నాగ్ రొమాన్స్

    అయితే యాంక‌ర్ స్ర‌వంతి త‌న‌కు ఆరోగ్యం బాగా లేద‌ని చెప్పి త‌మ టీమ్ మెంబ‌ర్స్ ఇంట్లో నుంచి వ‌స్తువులును బ‌య‌ట వేస్తుంటే వారిని సేక‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఓ బొమ్మ హౌస్ లో ఉన్న పూల్ లో ప‌డిపోతే దాన్ని తీయ‌డానికి అందులో దూకింది. కానీ ఆమెకు ఈత రాక‌పోవ‌డంతో గిలగిల కొట్టుకుంటోంది. అది చూసిన అజయ్ పూల్ లోకి దూకి ఆమెను కాపాడాడు.

    Bigg Boss OTT Telugu

     

    కాగా దీన్ని కూడా స‌ర‌యు ర‌చ్చ చేసింది. నీకు ఆరోగ్యం బాగా లేదు గానీ.. బొమ్మ సేక‌రించ‌డానికి పూల్ లో ఎలా దూకావ్ అంటూ గ‌ట్టిగా అరిచేసింది. దీంతో స్ర‌వంతి కూడా ఆమెతో గొడ‌వ‌కు దిగింది. ఏడుస్తూ మాట‌లు అనేసింది. దీంతో స్ర‌వంతి టీమ్ మెంబ‌ర్స్ ఆమెను వెన‌క్కు తీసుకు వ‌చ్చి కొన్ని స‌ప‌ర్య‌లు చేశారు. ఇలా బిగ్ బాస్ లో సమ‌యం సంద‌ర్భం లేకుండా నిత్యం గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ‘ఎత్తర జెండా’ అదిరిపోతోందట

     

    Tags