Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam Serial: కార్తీకదీపం’ సీరియల్ సమాప్తం.. ఇక ఏడుపులూ పెడబొబ్బలు ఉండవు.. ఫ్యాన్స్ గగ్గోలు

Karthika Deepam Serial: కార్తీకదీపం’ సీరియల్ సమాప్తం.. ఇక ఏడుపులూ పెడబొబ్బలు ఉండవు.. ఫ్యాన్స్ గగ్గోలు

Karthika Deepam Serial: తెలుగు వారు సెంటిమెంట్ కు ఫిదా అవుతారు. అది సీరియళ్లు అయినా సీరియస్ విషయాలైనా తెలుగువారి రూటే వేరు. పరాయి భాష అయినా మన భాష అయినా సరే నచ్చితే ప్రాణంగా చూస్తారు. లేదంటే పట్టించుకోరు. ఇటీవల తెలుగువారికి బాగా దగ్గరైన సీరియల్ కార్తీక దీపం. అందులోని పాత్రలను తమ నిజజీవితంలో పాత్రలుగా భావించుకుని నిత్యం స్మరించుకుంటూ రాబోయే ఎపిసోడ్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సీరియల్ ఇక ముగించినట్లు తెలుస్తోంది. అందులోని పాత్రలు నిరుపమ్, వంటలక్క లు చనిపోయినట్లు చూపించడంతో ఇక ఆ సీరియల్ కథ ముగిసినట్లేనని చెబుతున్నారు.

Karthika Deepam Serial
Karthika Deepam Serial

అయితే కొత్త జనరేషత్ తో ఈ సీరియల్ కొనసాగించేందుకు నిర్వాహకులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నిరుపమ్, వంటలక్క పాత్రలు ఇక కనుమరుగైనట్లే. ఇన్నాళ్లు ఏడుపు సీన్లతో మహిళలను మత్తెక్కించిన కార్తీక దీపం సీరియల్ ను ఇకపై కొనసాగించేందుకు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. ఇకపై ఏడుపులు ఉండవని అందరు ఊపిరిపీల్చుకుంటున్నా మళ్లీ సీరియల్ కొనసాగిస్తే పరిస్థితి మొదటికే వస్తుందంటున్నారు.

Also Read: క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తిన రష్మీ గౌతమ్

బుల్లితెర చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించిన కార్తీకదీపం సీరియల్ లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను రంజింపచేసిన సంగతి తెలిసిందే. ట్విస్టుల మీద ట్విస్టులిస్తూ సీరియల్ ను నాలుగేళ్లుగా కొనసాగిస్తున్నారు. అయితే ఇక సీరియల్ కు ముగింపు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కార్తీక్, దీప పాత్రలను చంపేసి ఇక కథ ముగించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.

Karthikadeepam  last day shoot || Emotional Day ||Shobha Shetty ||

కార్తీక్, దీప, హిమ, సౌర్య నలుగురు మంగుళూరు వెళ్తగా అక్కడ జరిగిన కారు ప్రమాదంలో కార్తీక్, దీప, హిమ చనిపోయినట్లుగా చూపించడం తెలిసిందే. దీంతో సీరియల్ ఇకపై కొనసాగింపు ఉండదని చెబుతున్నారు. ఇందులో లీడ్ రోల్స్ పోషించిన పాత్రలు మరణించడంతో సీరియల్ ముగిసినట్లే అని తెలుస్తోంది. కానీ ఇది కలనా? నిజమా? అనేది తేలడం లేదు.

Karthika Deepam Serial
Karthika Deepam Serial

కార్తీక్, దీప ల క్యారెక్టర్లు మళ్లీ తీసుకురావడానికి దర్శకుడు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. పిల్లల్ని పెద్దవాళ్లను చేస్తూ కథ ముందుకు నడిపించడానికి ముందే సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దీంతో దర్శకుడు ఏం ట్విస్ట్ ఇస్తారో అని అందరు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. దీనిపై అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. కార్తీక దీపం సీరియల్ ను ముగించడంపై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

 

Radhe Shyam First Review || Radhe Shyam Review Telugu || Prabhas || Ok Telugu Entertainment

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version