https://oktelugu.com/

Shruti Haasan Remuneration: ఛాన్స్ లు పెరిగాయి.. రెమ్యునరేషన్ పెంచేసింది

Shruti Haasan Remuneration: ‘శృతి హాసన్’ చాలా బోల్డ్.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే స్వభావం శృతికి మేకప్ తోనే అబ్బింది. పైగా మొహమాటం అనేది తన బ్లడ్ లోనే లేదనేది ఎపుడూ శృతి చెప్పే మాట. ప్రస్తుతం ఆమెకు ఛాన్స్ లు పెరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన శృతి హాసన్ భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా కోసం రూ.2 కోట్ల 10 […]

Written By:
  • Shiva
  • , Updated On : March 11, 2022 1:08 pm
    Follow us on

    Shruti Haasan Remuneration: ‘శృతి హాసన్’ చాలా బోల్డ్.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే స్వభావం శృతికి మేకప్ తోనే అబ్బింది. పైగా మొహమాటం అనేది తన బ్లడ్ లోనే లేదనేది ఎపుడూ శృతి చెప్పే మాట. ప్రస్తుతం ఆమెకు ఛాన్స్ లు పెరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన శృతి హాసన్ భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

    Shruti Haasan

    Shruti Haasan

    ఇక ఈ సినిమా కోసం రూ.2 కోట్ల 10 లక్షల వరకు డిమాండ్ చేస్తోందట. బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమాకు రూ.1.5 కోట్లు తీసుకుంటున్న ఈ భామ ఇప్పుడు రూ.60 లక్షలు పెంచేసినట్లు సమాచారం. సీనియర్ హీరోలతో నటించేందుకు ఇతర హీరోయిన్లు ఆలోచిస్తున్నారని, అందుకే శృతి అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెబుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ‘శృతి హాసన్’కి కాలం కలిసి వచ్చింది.

    Also Read:  ‘ఆర్ఆర్ఆర్’ ‘ఎత్తర జెండా’ అదిరిపోతోందట

    ఇక శృతి హాసన్‌ ప్రస్తుతం ప్రభాస్ భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్‌’ సినిమా షూటింగ్‌ తో ఫుల్ బిజీగా ఉంది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘శృతి హాసన్’ మాట్లాడుతూ.. తాను హీరోయిన్ గా మారడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. ‘నాకు సంగీతం అంటే ఇష్టం. నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు రాక్‌ స్టార్‌ అవ్వాలనే కోరిక ఉండేది. నేను రాక్ స్టార్ అయిపోయినట్టు కలలు కనేదాన్ని. నా సన్నిహితులకు కూడా తెలియదు. నేను ఆ సమయంలో ఒక రాక్‌ బ్యాండ్‌ నడపాలి అనుకున్నాను.

    Shruti Haasan

    Shruti Haasan

    కాకపోతే బ్యాండ్‌ నడిపే అంత నా దగ్గర అప్పుడు లేదు. పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే రెండు, మూడు సినిమాలు చేసి ఆ డబ్బుతో బ్యాండ్‌ మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకున్నాను. ఆ దశలో ఇక సినిమాలకు కూడా గుడ్‌ బై చెబుదామని అనుకున్నాను. అయితే, పరిస్థితులు మారాయి. అలాగే నా ఆలోచనలు కూడా. నాకు తెలియకుండానే నేను సినిమాలను ఇష్టపడ్డాను.

    మెల్లిగా నటన పై ప్రేమను పెంచుకున్నాను. చివరకు సినిమానే నా ప్రపంచం అయిపోయింది’ అని శృతి హాసన్ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఎలాంటి వ్యవహారం గురించి అయినా శృతి హాసన్ లా స్పందించే మరో హీరోయిన్ ఈ జనరేషన్ లో బహు అరుదు. ఇక శృతి హాసన్ కి పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదు. శృతి వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు.

    Also Read:   రాధేశ్యామ్ థియేటర్ దగ్గర ప్రమాదం.. సినిమా పై రాజమౌళి, గోపీచంద్ రియాక్షన్స్

     

    Radhe Shyam Movie 1st Day Box Office Collections || Radhe Shyam Review || Ok Telugu Entertainment

    Tags