Bigg Boss Nonstop Telugu: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. 17 మంది కంటెస్టెంట్లు ఈ షోలోకి అడుగుపెట్టగా ఇప్పటి వరకు 9 మంది ఎలిమినేట్ అయ్యారు. బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం హౌస్‌లో ఇంకా 9 మంది ఉన్నారు. తాజాగా ఈ షో 9వ వారంలోకి ఎంటరైంది. సోమవారం నామినేషన్‌ల పర్వం జరగ్గా.. పలువురు హౌస్ మేట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.

నామినేషన్‌ల సందర్భంగా ఒక కొత్త కాన్సెప్టుతో బిగ్ బాస్ హౌస్‌లోని వాతావరణాన్ని వేడెక్కించాడు. దిష్టిబొమ్మలు పెట్టి వాటిపై కుండలు పెట్టి నామినేట్ చేయాలనుకున్న వారి కుండలను బ్యాట్ తీసుకుని బద్దలు కొట్టి నామినేట్ చేయాలని ఆదేశించాడు. ఈ సందర్భంగా హౌస్‌లో చాలా క్లోజ్ అనుకుంటున్న బిందు మాధవి, శివ మధ్య కూడా వార్ నడిచింది. ముందుగా యాంకర్ శివను బిందు మాధవి నామినేట్ చేయడంతో ఈ మాటల వార్‌కు తెర లేచింది.
Also Read: Megastar Chiranjeevi: ఏండ్ల క్రితమే పాన్ ఇండియా మూవీ చేసిన మెగాస్టార్.. బడ్జెట్ ఎంతంటే..?
గత వారంలో తనను ఎఫెక్ట్ చేసిన ఓ విషయంలో శివ స్టాండ్ తీసుకోకపోవడం తనకు నచ్చలేదని బిందుమాధవి ఆరోపించింది. ఆ విషయం గురించి ముందే మాట్లాడుకున్నా.. తీరా దాని గురించి ఏం తెలియదన్నట్లు మాట్లాడావంటూ గుచ్చి గుచ్చి అడిగింది. దీంతో యాంకర్ శివ ఫైర్ అయ్యాడు. అక్కడికి వెళ్ళాక నువ్వు ఏం మాట్లాడతావో తెలియకుండా.. నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని గుర్తున్నా.. లేని విషయాన్ని తాను మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించాడు.

అంతేకాకుండా హౌస్‌లో తానంటే అస్సలు పడని అఖిల్‌ను సాక్ష్యంగా తీసుకునేందుకు శివ ప్రయత్నించాడు. దీంతో బిందుకు మరింత కోపం పెరిగింది. అయితే ఇన్ని రోజులు చెప్పకుండా నువ్వు ఆదివారం నాడు ఆ పాయింట్ తీస్తావు అని నేను కలగన్నానా.. అలా ఎందుకు చెబుతున్నావంటూ శివ ప్రశ్నించాడు. అయితే ఆ మాట తనను బాధపెట్టిందంటూ బిందు సీరియస్ అయ్యింది.

అయితే బిగ్ బాస్‌ను మరింత రసవత్తరంగా మార్చే క్రమంలోనే ఈ ట్విస్ట్ ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాఫీగా సాగితే మజా ఏం ఉంటుంది.. అందుకే ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారేమో అని అంటున్నారు నెటిజన్లు. బిందు శివను నామినేట్ చూడటాన్ని బట్టి చూస్తుంటే.. ఆమెను ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అర్థమవుతోంది.
Also Read:Revanth Reddy- Drugs Case: డ్రగ్స్ కేసును వదలని రేవంత్.. చిక్కుల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు
Recommended Videos:
[…] […]
[…] Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, ఇంకా చెప్పాలంటే ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’.. ప్రస్తుతం ‘అకీరా నందన్’ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఇలాగే ఫీల్ అవుతున్నారు. ఈ నెల 8న అకీరా నందన్ 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రక్తదానం చేశాడు. ఉడుకు రక్తం ఉరకలు వేసే వయసులో అసలు అకీరాకి ఇంత పెద్దరికం ఎలా వచ్చింది ? అది పవన్ బ్లడ్ లోని నైజం అంటున్నారు పవన్ ఫ్యాన్స్. […]
[…] […]