Bigg Boss Non Stop OTT Telugu: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షోలో రోజురోజుకు ఎమోషనల్ రివెంజ్ డ్రామాలు, కంటెస్టెంట్ల మధ్య వింత వింత టాస్కులు.. ప్రేక్షకులకు మరింత కిక్ ను ఇస్తున్నాయి. కంటెస్టెంట్లు కూడా గెలవడానికి ఎవరికి వాళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, 5వ వారం నామినేషన్స్ ఫుల్ హీటెక్కాయి. ఒకరి తలపై ఒకరు గుడ్డు పగలగొట్టుకుని మరీ నామినేట్ చేసుకునే స్థాయిలో డ్రామా జరిగింది.
Bigg Boss Non Stop OTT Telugu
పైగా లాస్ట్ వీక్ లో జరిగిన అంశాలను గుర్తు చేసుకుని మరీ రెచ్చిపోయారు. మాటకి మాట అన్నట్టు సీరియస్ అవుతూ.. మాటలతోనే తూటాల్లా పేలిపోయారు. ఏది ఏమైనా నామినేట్ చేసుకుంటూ ఒకరికి ఒకరు భారీ పంచ్ లు పేల్చారు. దాంతో ఈ నామినేషన్స్ ఫుల్ ఫైర్ లో జరిగాయి. ముఖ్యంగా తేజస్వి ఎవరిని ఎలా లాక్ చేయాలో పక్కగా ప్లాన్ చేసుకుంది. మెయిన్ గా అరియానా విషయంలో అషూరెడ్డి ని లాక్ చేసింది.
Also Read: RRR 4th day Collections: కలెక్షన్ల ప్రవాహం.. తగ్గేదే లే
అలాగే, నటరాజ్ మాస్టర్ ని కూడా ప్లాన్ ప్రకారం పక్కాగా టార్గెట్ చేసింది. ఇక అఖిల్ అండ్ టీమ్ ఎప్పటిలాగే యాంకర్ శివ – బిందు మాధవి ని టార్గెట్ చేశారు. పనిలో పనిగా మహేష్ విట్టాని కూడా బాగానే టార్గెట్ చేశారు. అయితే, విచిత్రంగా ఈ సారి నామినేషన్స్ లో యాంకర్ శివ కామెడీ కాస్త సీరియస్ అయ్యింది. అతనికి – మిత్రా శర్మాకి మద్యలో పెద్ద ఘర్షణే జరిగింది.
Bigg Boss Non Stop OTT Telugu
యాంకర్ శివ మిత్రాని ఓ రేంజ్ లో ఆడుకుంటూ ఆమె పై విరుచుకు పడ్డాడు. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి అన్నట్టు ఆమెను నామినేట్ చేస్తూ రెచ్చిపోయాడు. అయితే, యాంకర్ శివ.. మిత్రా శర్మా గురించి చెప్పిన డైలాగ్ కూడా బాగా పేలింది. ఇంతకీ అతను ఏమి చెప్పాడంటే.. ‘నువ్వు ఫేక్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి కానీ, నిన్ను ఫేక్ అంటే నువ్వు తీసుకోలేవు’ అంటూ ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడు.
కాగా టైటిల్ ఫేవరెట్ బిందు మాధవి.. అఖిల్ కి పోటీగా ఒక సైన్యాన్నే తయారు చేస్తోంది. మొత్తమ్మీద ఈ వారం మొత్తం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. ఇందులో శివ, మిత్రాశర్మా, బిందుమాధవి, అనిల్, మహేష్ విట్టా, అరియానా, ఇంకా అషూరెడ్డిలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Senthil Kumar: బాహుబలికి, ఆర్ఆర్ఆర్ కు తేడా అదేనట?
Recommended Video: