RRR 4th day Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోతుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ బాలీవుడ్ సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయినా.. రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అంటూ ట్రేడ్ పండితులు కూడా నోరెళ్ళ బెట్టి చూస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి సంబంధించి.. బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే..
ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. మరి నాలుగో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.
Also Read: Senthil Kumar: బాహుబలికి, ఆర్ఆర్ఆర్ కు తేడా అదేనట?
నైజాం 61.50 కోట్లు
సీడెడ్ 31.70 కోట్లు
ఉత్తరాంధ్ర 17.62 కోట్లు
ఈస్ట్ 09.62 కోట్లు
వెస్ట్ 08.57 కోట్లు
గుంటూరు 12.43 కోట్లు
కృష్ణా 09.16 కోట్లు
నెల్లూరు 05.38 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని నాలుగు రోజులకు గానూ 155.98 కోట్లు కలెక్ట్ చేసింది.
తమిళ నాడు : 18.77 కోట్లు
కేరళ : 05.28 కోట్లు
కర్ణాటక : 22.17 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) : 45.42 కోట్లు
ఓవర్సీస్ : 63.15 కోట్లు
రెస్ట్ : 04.91 కోట్లు
మొత్తం నాలుగు రోజులకు గానూ టోటల్ వరల్డ్ వైడ్ గా 315.58 కోట్లు కలెక్ట్ చేసింది.
ఒక తెలుగు సినిమా నాలుగో రోజు కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. హాలీవుడ్ భారీ సినిమాలకు వచ్చిన రేంజ్ లో.. నాలుగో రోజు కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. ఇలాంటి భారీ మల్టీస్టారర్ సినిమా అంటే.. అది అమెరికా అయినా, అనకాపల్లి అయినా ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగే. ప్లేస్ ఎక్కడైనా ఆడియన్స్ ఎవరైనా థియేటర్స్ వద్ద కోలాహలం భారీ స్థాయిలో ఉంటుంది.
ఇక అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.498 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. నేటి వరకు చూసుకుంటే.. ఈ చిత్రం రూ.315.68 కోట్ల భారీ షేర్ ను సాధించింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.560 కోట్లను కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఈ సినిమాకి భారీ లాభాలు రాబోతున్నాయి.
Also Read: NTR Emotional Letter: ఎన్టీఆర్ ఎమోషనల్ లెటర్.. ఎవరి గురించి ఏమి చెప్పాడంటే ?
Recommended Video: