Homeఅంతర్జాతీయంRussia Ukraine War: భర్తను చంపి యుక్రెయిన్ మహిళపై అత్యాచారం.. ఇదీ రష్యన్ సైనికుల దురాగతం..

Russia Ukraine War: భర్తను చంపి యుక్రెయిన్ మహిళపై అత్యాచారం.. ఇదీ రష్యన్ సైనికుల దురాగతం..

Russia Ukraine War: యుక్రెయిన్ లో రష్యా సాగిస్తున్న మారణకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే.. దాడులతో రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. దీంతో యుక్రేయిన్ ప్రజలు ఇప్పటికే లక్షలాది మంది దేశం వదిలి వలస వెళ్లి పోతున్నారు. ఉన్నవారి ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియట్లేదు.

Russia Ukraine War
Russia Ukraine War

రష్యా బలగాలు సాగిస్తున్న దుర్మార్గమైన యుద్ధ వాతావరణంలో.. ఏ ఇంటి మీద ఎప్పుడు బాంబుల వర్షం కురుస్తుందో.. ఏ మనిషి ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకట్లేదు. సామాన్య ప్రజల ఇళ్లపై ఘోరాతి ఘోరంగా బాంబు దాడులు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు రష్యా సైనికులు.

Also Read: Paddy Issue: ధాన్యం ఫైట్: టీఆర్ఎస్ బీజేపీ మధ్యలోకి కాంగ్రెస్ ఎంట్రీ

అయితే ఈ యుద్ధంలో రష్యన్ సైనికులు చేస్తున్న చాలా దుర్మార్గమైన పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చాలా మంది మహిళల మీద రష్యన్ సైనికులు అత్యాచారం చేస్తున్నారని ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

రష్యన్ సైనికులు బలవంతంగా తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తమ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు రష్యన్ సైనికులు.. మొదట తన భర్తను చంపి.. తన తలపై గంగ పెట్టి బెదిరించి అత్యాచారం చేసినట్టు వాపోయింది. అలా ఒకరి తర్వాత ఒకరు తనమీద దుర్మార్గమైన చర్య సాగించినట్లు ఆరోపించింది.

Russia Ukraine War
Russia Ukraine War

ఇంట్లో ఉన్న తన నాలుగేళ్ల కొడుకును బాయిలర్ రూమ్ లో పడేసిన సైనికులు.. ఎంతలా ఏడుస్తున్నా పట్టించుకోకుండా దారుణానికి ఒడిగట్టినట్లు ఆమె పేర్కొంది. ఆ తర్వాత తన భర్త శవాన్ని భయంతో అక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కొడుకుతో సహా పారిపోయినట్లు ఆమె వివరించింది. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తమ దేశ ప్రజల మాన, ప్రాణాలతో ఆడుకుంటున్న రష్యన్ సైనికుల మీద యుక్రెయిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Also Read: BJP Bandi Sanjay: ‘పాతబస్తీ’పై బీజేపీ వార్.. ఇరుకునపడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version