Bigg Boss Nominations: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ హౌస్ లో ఈ రోజు నామినేషన్లు రచ్చ రచ్చే అన్నట్టు సాగాయి. ‘బిందుమాధవి’ని అఖిల్, నటరాజ్ టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘బిందుమాధవి’ తండ్రిని ఉద్దేశించి ఈమెకు జ్ఞానాన్ని నేర్పించండి అంటూ నటరాజ్ మాస్టర్ కామెంట్స్ చేయడం, అలాగే ‘నువ్వు అసలు తెలుగు అమ్మాయివేనా ? ఒక తెలుగు అమ్మాయికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా నీకు లేదు’ అంటూ బిందు వైపు నటరాజ్ ఉరిమి ఉరిమి చూశాడు. బిందు కూడా ‘తగ్గేదేలే అన్నట్టు అతనికి దీటుగా నిలబడటం తాజాగా వదిలిన ప్రోమోలో హాట్ టాపిక్ అయ్యింది.

పైగా నేను తెలుగు వాడిని, తెలుగు ప్రేక్షకులను కష్టపడి ఎంటర్ టైన్ చేస్తున్నా అంటూ నటరాజ్ మాస్టర్ ఉన్నట్టు ఉండి తెలుగు భాష కార్డ్ ను తీసుకొచ్చాడు. ఇక అఖిల్ కూడా మళ్లీ బిందునే టార్గట్ చేశాడు. బిందుతో గొడవలు పెట్టుకోను అని అఖిల్ ఒట్టు వేసిన సంగతి తెలిసిందే. అయితే.. అఖిల్ తాను వేసిన ఒట్టును గట్టుపై పెట్టి మరీ… భిందుతో యుద్దానికి దిగాడు.

తన పై ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా.. తన తండ్రిని కూడా లాగి తనను అవమానించినా బిందుమాధవి’ మాత్రం ఎక్కడా తగ్గదేలే అన్నట్టు సాగింది ఆమె ప్రవర్తన. మరోపక్క నటరాజ్ మాస్టర్, అఖిల్.. బిందుమాధవి పై కామెంట్స్ చేస్తున్న క్రమంలో శివ ఎక్స్ ప్రెషన్స్ కూడా చాలా వేగంగా మారిపోతూ కనిపించాయి.

ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ ఆవేశాన్ని ఆక్రోశాన్ని చూసి శివ పేస్ లో కోపం స్పష్టంగా కనిపించింది. అలాగే మిత్రా శర్మా పై అరియానా కూడా హాట్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ కి మిత్ర శర్మ కూడా అంతే ఆవేశంతో ఊగిపోతూ బలహీనంగా ఉన్నప్పుడు ఎవరైనా కొడతార్రా’ అంటూ ఎమోషనల్ అయ్యింది. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో రగిలిన ఆవేశాలు ప్రేక్షకులకు సరదగా అనిపిస్తున్నా
Also Read: Mahesh Babu Sentiment: మహేష్ బాబు సెంటిమెంట్.. ఆర్ఆర్ఆర్ రికార్డు బద్దలు
Recommended Videos: