Civil Aviation Minister Shri Jyotiraditya: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ‘జ్యోతిరాదిత్య సింధియా’ చాలా నిబద్ధతతో కూడిన రాజకీయ నాయకుడు అని మంచి పేరు ఉంది. అలాంటి ఆయన తాజాగా ఫైర్ అయ్యారు. ఎప్పుడు కూల్ గా కనిపించే జ్యోతిరాదిత్య సింధియా ఎందుకు సీరియస్ అయ్యారు ? అసలు ఏమి జరిగింది ? ఓ దివ్యాంగ చిన్నారని మిమానం లోని ఎక్కనివ్వకుండా ఇండిగో విమాన సిబ్బంది ఓ అమానవీయ ఘటనకు తెరలేపారు.

పైగా ఆ చిన్నారి తల్లిదండ్రులతో ఇండిగో విమాన సిబ్బంది వాగ్వాదానికి దిగడం కూడా బాధాకరమైన విషయం. ఇండిగో విమాన సిబ్బంది ప్రవర్తన కారణంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ వివక్షపూరిత ఘటన గురించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి తెలిసింది.

Also Read: Mental Health: మానసిక ఆరోగ్యానికి ఈ నాలుగు అవసరం
దాంతో ఆయన ఇండిగో విమాన సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల తోటి ప్రయాణికురాలు ఈ ఘటనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఆ పోస్ట్ చివరకు జ్యోతిరాదిత్య సింధియా వరకు చేరింది.
ఆ పోస్ట్ చూసిన ఆయన దీనిపై స్పందిస్తూ.. ఇండిగో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్వయంగా తానే ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతానని వెల్లడించి అందర్నీ షాక్ గురి చేశారు. ‘‘ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం జరగకూడదు. దీనిపై స్వయంగా నేను దర్యాప్తు చేపడతాను. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.
Recommended Videos: