Vijay Devarakonda Special Song: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ హంట్ థీమ్‌లో విజయ్ దేవరకొండ వేటాడే సింహంలా సిక్స్ ప్యాక్ తో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. భాస్కరభట్ల అందించిన సాహిత్యం చాలా బాగుంది.

‘‘బతకాలంటే గెలవాల్సిందే
ఎగరాలంటే రగలాల్సిందే
నువ్వు పుట్టిందే గెలిచెటందుకు
దునియా చమడాల్ వలిచెటందుకు
అది గుర్తుంటే ఇంకేం చూడకు
ఎవడు మిగలడు ఎదురు పడెందుకు
ఛల్ లైగర్.. హంట్..’’
అంటూ సాగిన ఈ హంట్ థీమ్ చాలా బాగా ఆకట్టుకుంది. ఈ హంట్ థీమ్‌ని విక్రమ్ మాంట్రోస్ కంపోజ్ చేయగా.. హేమచంద్ర ఫుల్ ఎనర్జీటిక్ తో చాలా అద్భుతంగా పాడారు. అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.

Also Read: Natashiromani Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !
అన్నిటికి మించి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఎలాగూ చివరి దశ షూటింగ్ లో ‘లైగర్’ ఉంది కాబట్టి.. సినిమా ఫస్ట్ వెర్షన్ కూడా దాదాపు రెడీ అయింది. ఆ ఫస్ట్ వెర్షన్ ను చూసిన సినిమా టీమ్ లోని కొంతమంది సభ్యులు సినిమా అవుట్ ఫుట్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళంతా ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు.
అందుకే, లైగర్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరితోనే మరో సినిమా చెయ్యాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. ఇప్పుడు పూరి కోసం మరో రెండేళ్లు టైమ్ కేటాయిస్తాడట. ఇక ‘లైగర్’ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: Y S Konda Reddy: పులివెందులలో వైఎస్ కొండారెడ్డి అరెస్టుతో ఏం జరుగుతోంది?
Recommended Videos