https://oktelugu.com/

Nikhil : స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న బిగ్ బాస్ నిఖిల్…దెబ్బకి బూరేల బుట్టలో పడ్డాడుగా…

ఇక 105 రోజులపాటు టెలివిజన్ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన బిగ్ బాస్ షో సీజన్ 8 ఎట్టకేలకు ముగిసింది.

Written By:
  • Gopi
  • , Updated On : December 16, 2024 / 02:48 PM IST

    Nikhil

    Follow us on

    Nikhil : ఇక 105 రోజులపాటు టెలివిజన్ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన బిగ్ బాస్ షో సీజన్ 8 ఎట్టకేలకు ముగిసింది…గ్రాండ్ ఫినాలే కి వచ్చి నిఖిల్ ని విన్నర్ గా అనౌన్స్ చేసి అతనికి ప్రైజ్ మనీ అందించడమే కాకుండా ట్రోఫీ ని కూడా తన చేతిలో పెట్టడం తో ఈ సీజన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఓకేతైతే ఇక మీదట నుంచి చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే సినిమాలే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా కొంతమంది నటులు వాళ్ల సత్తా చాటుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటున్నాను. ఇక వాళ్ళు అనంతరం సిల్వర్ స్క్రీన్ మీద కూడా వాళ్ళ జాతకాలను పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి టెలివిజన్ లో వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా చాలామంది నటులు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటులుగా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిలిచిన నిఖిల్ సైతం ఇప్పుడు ఒక స్టార్ హీరో డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి నిఖిల్ ఇంతకుముందు కొన్ని సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. అలాగే బిగ్ బాస్ షో ద్వారా చాలామంది ఫ్యాన్స్ ని సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇలాంటి ఒక నటుడితో ఒక స్టార్ డైరెక్టర్ సినిమా చేయాలనే ఒక స్టార్ డైరెక్టర్ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    గత కొన్ని సంవత్సరాల క్రితం ‘ఈడు గోల్డ్ ఎహే’ అనే సినిమాను చేసి అప్పటినుంచి ఇప్పటివరకు వేరే సినిమా చేయకుండా ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న ‘వీరు పోట్ల’ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి వీరు పోట్ల మంచి దర్శకుడు ఆయన ఎంటైర్ కెరీర్లో బిందాస్, రగడ, దూసుకెళ్తా, ఈడు గోల్డ్ అనే సినిమాలను చేశాడు.

    అందులో ఈడు గోల్డ్ ఏహే అనే సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి. కాబట్టి నిఖిల్ కి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అయితే నిఖిల్ అతని డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియా మొత్తం ఒక న్యూస్ అయితే విపరీతమైన వైరల్ గా మారిందనే చెప్పాలి…

    ఇక ఏది ఏమైనా కూడా నిఖిల్ లాంటి సీరియల్స్ చేసే నటుడు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం అయితే వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు…