https://oktelugu.com/

Swarnandhra Vision 2047: స్వర్ణాంధ్ర 2047 : అప్పుడు ఐటీ.. ఇప్పుడు డ్రోన్స్.. బాబు ఆలోచన అదుర్స్

చంద్రబాబు నోట వినిపించే మాట ఐటి. 1999లో విజన్ 2020 అంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో డ్రోన్ల వ్యవస్థపై పడ్డారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 16, 2024 / 02:49 PM IST

    Swarnandhra Vision 2047(2)

    Follow us on

    Swarnandhra Vision 2047: ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్ గా ఏపీ నిలవనుంది. డ్రోన్ హబ్ గా ఏపీని మార్చాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047లో సైతం డ్రోన్ల రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.మనిషి చేయలేని పనులను.. అదే మనిషితో డ్రోన్ల ద్వారా చేయించే బృహత్తర ప్రణాళికను రూపొందించారు. సమాజంలో ఉన్న అన్ని రంగాల్లో డ్రోన్ల సేవలను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా సమయం ఆదా చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ డ్రోన్ పాలసీ ద్వారా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. డ్రోన్ రంగంలో 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఇది 2029 వరకు మాత్రమే. 2047 విజన్ లో లక్షలాది ఉద్యోగాలతో పాటు వేలకోట్ల రూపాయల రాబడిని పొందేందుకు లక్ష్యంగా పెట్టారు.

    * డ్రోన్ల హబ్ గా ఏపీ
    ఇటీవల విజయవాడకు వరద ముంచెత్తింది. వేల ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. వారి కోసం సహాయ చర్యలు చేపట్టారు. కానీ ఆహారంతో పాటు నిత్యవసరాలు అందించేందుకు డ్రోన్స్ ఎంతగానో సహకరించాయి. అప్పుడే బలమైన సంకల్పంతో ముందుకు సాగారు చంద్రబాబు. భవిష్యత్తు అవసరాలను డోన్ల ద్వారా ఎలా తీర్చుకోవచ్చు అన్నది చూపించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రోన్ల సదస్సు, ప్రదర్శన ఏర్పాటు చేసి.. ఆ రంగం అవసరాన్ని, అనివార్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

    * భారీగా కేటాయింపులు
    మరోవైపు డ్రోన్ హబ్ గా ఓర్వకల్లును ఎంపిక చేశారు. దాదాపు అక్కడ 3 ఎకరాల భూమిని కేటాయించారు. డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ బి ఫెసిలిటీ ఏర్పాట్లు వంటివి చేయనున్నారు. 25 వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుతో పాటు డ్రోన్ల రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యాసంస్థలకు 20 లక్షల రూపాయల ప్రోత్సాహం కూడా అందించేందుకు నిర్ణయించారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047లో సైతం డ్రోన్ ల గురించి, ఆ వ్యవస్థను ఎలా డెవలప్ చేస్తామో వివరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. మొత్తానికైతే 1999లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై దృష్టి పెట్టిన బాబు.. ఇప్పుడు డ్రోన్ల హబ్ గా ఏపీని మార్చాలని లక్ష్యంగా చేసుకున్నారు. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.