https://oktelugu.com/

Prabhas Injured: రెబల్ స్టార్ ప్రభాస్ కి తీవ్ర గాయాలు..షూటింగ్స్ కి తాత్కాలిక విరామం..ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే!

ఇతర దేశాల ఆడియన్స్ కి కూడా ఈ సినిమా రీచ్ అవ్వాలి. అందుకే ఆ చిత్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని జపాన్ భాషలోకి దబ్ చేసి వచ్చే నెల 3వ తారీఖున జపాన్ దేశం లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 02:43 PM IST

    Prabhas Injured

    Follow us on

    Prabhas Injured: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. కేవలం కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాదు, టెక్నీకల్ గా, కాన్సెప్ట్ పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకుల చేత ఔరా అనిపించింది. అందుకే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కచ్చితంగా ఈ చిత్రం కేవలం మన ఇండియన్ ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అయ్యే సినిమా కాదు. ఇతర దేశాల ఆడియన్స్ కి కూడా ఈ సినిమా రీచ్ అవ్వాలి. అందుకే ఆ చిత్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని జపాన్ భాషలోకి దబ్ చేసి వచ్చే నెల 3వ తారీఖున జపాన్ దేశం లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

    ఎదో ఫార్మాలిటీ గా విడుదల చేస్తున్నట్టు కాకుండా, #RRR చిత్రానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఎలా అయితే జపాన్ దేశం వ్యాప్తంగా ప్రొమోషన్స్ చేసారో, అలా ‘కల్కి’ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రొమోషన్స్ కి హీరో ప్రభాస్ రాలేనని మూవీ టీం తో చెప్పారట. కారణం ఇటీవల ఆయనకు షూటింగ్ లో గాయాలు అవ్వడం వల్లే. ఒక భారీ యాక్షన్ సన్నివేశం చేస్తుండగా, ప్రభాస్ గాయాలు అయ్యినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కి ఎలాంటి ప్రమాదం లేదని, కేవలం ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారట. దీంతో ప్రభాస్ కి గాయాలు అయ్యిందని తెలుసుకొని ఆందోళన చెందుతున్న అభిమానులకు కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే జెట్ స్పీడ్ దూసుకుపోతున్న రాజాసాబ్ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసి ఏప్రిల్ 10 న గ్రాండ్ గా విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఇన్ని రోజులు ఉన్నారు మేకర్స్.

    కానీ ప్రభాస్ ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండడంతో షూటింగ్ వాయిదా పడింది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోతే ఈ సినిమాని వాయిదా వేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు కేవలం 60 శాతం షూటింగ్ మాత్రమే అయ్యింది. 40 శాతం బ్యాలన్స్ షూట్ తో పాటు VFX వర్క్ చాలా వరకు మిగిలి ఉందట. ఆ కారణం చేతనే ఈ సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ‘సలార్ 2’ , అదే విధంగా హను రాఘవపూడి తో మరో సినిమా చేస్తున్నాడు. ‘సలార్ 2 ‘ కి సంబంధించి ఇటీవలే ఆయన ఒక షెడ్యూల్ లో కూడా పాల్గొన్నాడు.