https://oktelugu.com/

Inaya Sultana: వివాదాస్పద స్వామితో కనిపించి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ ఇనయ… వీడియో వైరల్

చిత్ర పరిశ్రమలో చాలా మంది వేణు స్వామి కస్టమర్స్ గా ఉన్నారు. టైటిల్స్, కాంబినేషన్స్, విడుదల తేదీలను గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇక జ్యోతిష్యుల దగ్గర న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకున్న హీరోయిన్లు ఉన్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : January 17, 2024 / 07:29 PM IST

    Inaya Sultana

    Follow us on

    Inaya Sultana: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి కి చిత్ర పరిశ్రమతో గట్టి సంబంధాలు ఉన్నాయి. కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్లు కెరీర్ లో ఎదగాలనే కోరిక తో వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయిస్తూ ఉంటారు. అయితే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా కూడా ఆయన భక్తురాలే అని తేలింది. నాగరిక సమాజంలో కూడా మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళకు కొదువలేదు. పూజలు చేయడం వల్ల జీవితాలు మారిపోతాయి అని భావించి జ్యోతిష్యులకు లక్షలు పెట్టి ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు.

    చిత్ర పరిశ్రమలో చాలా మంది వేణు స్వామి కస్టమర్స్ గా ఉన్నారు. టైటిల్స్, కాంబినేషన్స్, విడుదల తేదీలను గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇక జ్యోతిష్యుల దగ్గర న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకున్న హీరోయిన్లు ఉన్నారు. వేణు స్వామి చాలా కాలంగా సెలెబ్రెటీలకు జ్యోతిష్యం చెబుతూ ఉన్నాడు. రష్మిక మందన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి పలువురు హీరోయిన్లు లక్షలు పెట్టి ఆయనతో పూజలు జరిపించుకున్నారు.

    కాగా ఈ లిస్ట్ లో బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తానా కూడా చేరింది. వేణు స్వామి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా లో అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి దిగిన ఫోటోలు, పూజలు జరిపించుకున్న వీడియోలు షేర్ చేసింది.

    వేణు స్వామి స్టార్ హీరోలైన ప్రభాస్, నాగ చైతన్య, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి వారి పై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి. వేణు స్వామి హీరోల వ్యక్తిగత జీవితం పై చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ ని బాధించాయి. అతన్ని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. ఆయన కూడా అదే విధంగా ఫ్యాన్స్ కి గట్టి కౌంటర్లు ఇస్తుంటాడు. అలా స్టార్ హీరోల ఫ్యాన్స్ తో వేణు స్వామికి వార్ నడుస్తూ వస్తుంది. ఏదేమైనా వేణు స్వామికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. హీరో బాలకృష్ణ కూడా తన కస్టమర్ అని వేణు స్వామి ఓ సందర్భంలో చెప్పారు.