Minister Pawan Kalyan: ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఎంత జీతం తీసుకుంటారో తెలుసా?

రెండు సినిమాలు రెండు పార్టుల్లా రాబోతున్నాయి కాబట్టి మొత్తం ఐదు సినిమాలు అన్నమాట. ఇదెలా ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఎమ్మెల్యేకు ఇచ్చే సాలరీ ఎంత ఉంటుందనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉండే ఉంటుంది.

Written By: Swathi Chilukuri, Updated On : June 13, 2024 5:18 pm

Minister Pawan Kalyan

Follow us on

Minister Pawan Kalyan: ఓ పక్క సినిమాలు మరో పక్క రాజకీయం అంటూ ఫుల్ బిజీగా ఉన్న నాయకుడు. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో హరిహర వీర మల్లు, ఓజి సినిమాలు రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో, ఎన్నికల ప్రచార పనుల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలు పెడతారు అనే టాక్ వినిపిస్తుంది. ఎప్పుడు అనే విషయం ఇంకా ప్రకటించాల్సి ఉంది.

రెండు సినిమాలు రెండు పార్టుల్లా రాబోతున్నాయి కాబట్టి మొత్తం ఐదు సినిమాలు అన్నమాట. ఇదెలా ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఎమ్మెల్యేకు ఇచ్చే సాలరీ ఎంత ఉంటుందనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉండే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా నాకు వచ్చే సాలరీ తీసుకుంటానని.. అలా తీసుకోవడానికి కారణం కూడా వివరించారు. జీతం తీసుకుంటున్నప్పుడు ప్రజలకి తన కాలర్ పట్టుకొని డబ్బులు తీసుకున్నావు కదా అని అడుగుతారు పని చేయకపోతే అని మాట్లాడారు. ఇదెలా ఉంటే ఏపీ లో ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం నెలకి లక్షా పాతిక వేలు.

గతంలో ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అది లేకపోవడంతో, రూ. 50,000 హౌస్ రెంట్ అలవెన్స్ అదనంగా ఇస్తున్నారు. వీటితో పాటు, ఫోన్ సదుపాయాలు, సిట్టింగ్ అలవెన్స్, వారి అవసరాలకు తగ్గట్టుగా వన్ ప్లస్ వన్ లేదా టు ప్లస్ టు గన్ మెన్ సిబ్బందిని కూడా అందిస్తున్నారు. అంతేకాదు వాహనాలు కొనుగోలు కోసం అడ్వాన్స్ ఇస్తారు. ల్యాప్‌టాప్ లు, ట్యాబ్ లు కూడా అందిస్తారట. భారతదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ఒకే రకంగా జీతం వస్తుందా అనే అనుమానం కూడా మీలో ఉండవచ్చు. కానీ అందరికీ ఒకే రకమైన జీతం ఉండదట. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల జీతాల విషయంలో పరిమితులు ఉండవు. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని జీతాలని నిర్ణయిస్తారు.

శాసనసభ్యులకు జీతంతో పాటు, నియోజకవర్గ అలవెన్స్, కంటింజెన్సీ అలవెన్స్, సెక్రటేరియట్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల్లో సభకు హాజరైతే, ప్రతి రోజు హాజరైన వారికి సిట్టింగ్ అలవెన్స్ ఇస్తారు. ఇక మాజీ ఎమ్మెల్యే లకి పెన్షన్ తో పాటు, ట్రావెల్, మెడికల్ సదుపాయాలు ఉంటాయి. మొత్తం మీద ఒక రోజు షూటింగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ ఎమ్మేల్యేగా నెలకు లక్ష యాభై వేల జీతం తీసుకుంటున్నారు. అందుకే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని నమ్ముతున్నారు ప్రజలు.