Bigg Boss 7 Telugu: బాస్ హౌస్ లో ఫినాలే వీక్ నడుస్తుంది. ఇందులో భాగంగా టాప్ 6 కంటెస్టెంట్స్ కి వారి జర్నీ వీడియోలు చూపించారు బిగ్ బాస్. ఒక్కొక్కరి ఏవీలు ఎమోషనల్ గా సాగాయి. ఇక నిన్నటితో అందరి జర్నీ వీడియోలు పూర్తయ్యాయి. కాగా నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. హౌస్ మేట్స్ కోసం వారి ఇంటి నుండి భోజనం తెప్పించారు. ఆ భోజనాన్ని కొన్ని టాస్కులు ఆడి గెలుచుకోవాలని బిగ్ బాస్ మెలిక పెట్టాడు.
ముందుగా అర్జున్ కోసం తన భార్య భోజనం పంపింది. ఆ ఫుడ్ అర్జున్ తినాలంటే… యావర్ ‘ షేక్ బేబీ షేక్ ‘ టాస్క్ ఆడి గెలవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అర్జున్ కి ఇంటి నుంచి వచ్చిన భోజనం లభిస్తుంది. ఇక టాస్క్ లో యావర్ ప్రతిభను చూపాడు. శ్రద్దగా గేమ్ ఆడి గెలిచి అర్జున్ కి ఫేవర్ చేశాడు. గతంలో ఈ టాస్క్ వల్లే అర్జున్ చేతి నుంచి ఎవిక్షన్ పాస్ చేజారి యావర్ కు దక్కింది. దీని మూలంగా వారి మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి.
ఇప్పుడు అదే టాస్క్ లో యావర్ గెలిచి అర్జున్ ని గెలిపించాడు. ఇక తర్వాత శివాజీ కోసం ప్రియాంక టాస్క్ ఆడింది. ఇక ప్రియాంక కి ఇచ్చిన విల్లు పై బాల్స్ బ్యాలెన్సింగ్ గేమ్ లో విజయం సాధించింది. ఇక చివరిగా శివాజీ అమర్ కోసం ఆడాడు. ఆయనకు మూడు నిమిషాల్లో యాక్టివిటీ ఏరియాలో ఉన్న బెలూన్స్ అన్ని తల టోపీ సాయంతో పగల కొట్టాలని టాస్క్ ఇచ్చారు.
మరి శివాజీ గెలిచాడో లేదో .. అమర్ కి ఇంటి భోజనం దక్కుతుందో లేక ఎప్పటిలానే చివరకు చేయిజారి పోతుందో చూడాలి మరి. ఇది ఇలా ఉండగా .. షో మరో మూడు రోజుల్లో ముగుస్తుంది. కాగా నిర్వాహకులు గ్రాండ్ ఫినాలే ఘనంగా ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. విన్నర్ ని కూడా ఆ రోజే ప్రకటిస్తారు. చూడాలి మరి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ లలో ఎవరు విన్ అవుతారో అని ఉత్కంఠగా మారింది.