Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ హీరో కి లేని క్రేజ్ పవన్ కళ్యాణ్ కి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ చేస్తూ బిజీగా ఉంటున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆయన పాలిటిక్స్ లోనే బిజీగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇంకొక 4 నెలల్లో ఎలక్షన్స్ ఉండడంతో తను పాలిటిక్స్ లో బిజీగా తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్నీ కూడా ఎలక్షన్స్ తర్వాత మళ్లీ షూటింగ్ కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక అన్ని సినిమాల విషయం ఎలా ఉన్నా కూడా క్రిష్ డైరెక్షన్ లో అప్పుడేప్పుడో స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదు ఆ సినిమా తర్వాత కమిట్ అయిన సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హరిహర విరమల్లు పరిస్థితి మాత్రం ఎలా ఉందో ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు.క్రిష్ ఆ సినిమా మీదనే చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద కూడా క్లారిటీ అయితే రావడం లేదు.ఇక ఇప్పటికే సినిమా నుంచి ఒక చిన్న టీజర్ వచ్చింది అది ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది.
ఇక ఈ సినిమా మీద మంచి హైప్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందా లేక షూట్ కొంచం పోస్ట్ పోన్ చేశారా అనేది ఎవ్వరికి తెలీయడం లేదు.ఇక ఈ సినిమా నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రావడం లేదు. మరి ఈ సినిమా మీద అటు క్రిష్ గాని, ఇటు పవన్ కళ్యాణ్ గాని ప్రొడ్యూసర్ అయిన ఏ ఏం రత్నం గాని ఎవరు స్పందించకపోవడంతో ఈ సినిమా ప్రస్తుతానికి ఆపేశారా అని కూడా జనాల్లో సందేహాలు కలుగుతున్నాయి.క్రిష్ మాత్రం ఈ సినిమా మీదనే దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మధ్యలో ఏ సినిమా లేకుండా ఆయన ఖాళీగా ఉంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమాని పూర్తి చేసి మరో సినిమా మీదికి దృష్టి పెడతాడా లేదా ఈ సినిమాని మధ్యలోనే వదిలేసి మరో సినిమా చేస్తాడా అనే విషయాల మీద కూడా క్లారిటీ రావడం లేదు.ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ఎప్పుడు అడిగిన కూడా అవి ఇవి కారణాలు చెప్తున్నట్టుగా ప్రొడ్యూసర్ అయితే చెప్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తి అయి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…