Prabhas: చెక్కుచెదరని ‘బాహుబలి 2’ రికార్డు… జోష్ లో ప్రభాస్ అభిమానులు

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చిన చిత్రం బాహుబలి. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించిన మూవీ “బాహుబలి”. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై అఖండమైన విజయాన్ని అందుకోగా విదేశాల్లో కూడా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. 2017లో విడుదలైన బాహుబలి – 2 ట్రైలర్ ఇప్పటికీ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 10, 2021 8:44 pm
Follow us on

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చిన చిత్రం బాహుబలి. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించిన మూవీ “బాహుబలి”. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై అఖండమైన విజయాన్ని అందుకోగా విదేశాల్లో కూడా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. 2017లో విడుదలైన బాహుబలి – 2 ట్రైలర్ ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో టాప్‌లో కొనసాగుతుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “ఆర్.ఆర్.ఆర్” భారీ అంచనాల నడుమ ఈ గురువారం ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ యూనిట్. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ కూడా బాహుబలి-2 రికార్డును టచ్ చేయలేకపోయింది.
బాహుబలి – ది కంక్లూజన్ ట్రైలర్ 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ దక్కించుకుని దక్షిణాది చిత్రాల్లోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే “ఆర్.ఆర్.ఆర్” ట్రైలర్ 24 గంటల్లో 20.4 మిలియన్ వ్యూస్ మాత్రమే రాబట్టింది. దీనితో డార్లింగ్ అభిమానులు మరోసారి బాహుబలి-2 సినిమాను గుర్తుచేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. బాహుబలి2 అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. నాలుగేళ్లు పూర్తయిన బాహుబలి-2 రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారని పలువురు రెబల్ స్టార్ అభిమానులు కామెంట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కానుంది.