https://oktelugu.com/

Ariyana Glory: లావుగా ఉన్నావన్న నెటిజెన్… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన అరియనా!

సెలెబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపులు చాలా కామన్. మనల్ని ఏం చేస్తారులే అనే ధైర్యంతో ఆకతాయిలు ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. బట్టలు, బాడీపై అనవసర కామెంట్స్ పోస్ట్ చేస్తారు.

Written By:
  • Shiva
  • , Updated On : October 10, 2023 / 01:07 PM IST

    Ariyana Glory

    Follow us on

    Ariyana Glory: సెలెబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపులు చాలా కామన్. మనల్ని ఏం చేస్తారులే అనే ధైర్యంతో ఆకతాయిలు ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. బట్టలు, బాడీపై అనవసర కామెంట్స్ పోస్ట్ చేస్తారు. చాలా మంది ఈ ట్రోల్స్ ని పట్టించుకోరు. అయితే శృతి మించి వేధింపులకు గురి చేస్తే రియాక్ట్ కాక తప్పదు. బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీని ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్స్ చేసిన నెటిజన్ పై ఆమె ఫైర్ అయ్యారు. వీడియో విడుదల చేసి ఇచ్చి పడేసింది. లావుగా అయ్యావని కామెంట్స్ చేసిన నేపథ్యంలో అరియనా రియాక్ట్ అయ్యారు.

    సన్నగా ఉంటే ఏంటి ఇంత సన్నగా ఉన్నావు అంటారు. లావు అయితే లావైపోయావు అంటారు. అయినా నేను ఎలా ఉంటే మీకెందుకు. మీకు పని పాటా లేదా. ఇలా నన్ను భాదపెడితే మీకు ఆనందం వేస్తుందా. అయితే కామెంట్స్ చెయ్ పర్లేదు. నేను పట్టించుకోను. ఖాళీగా ఉంటూ ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు… అని అరియనా దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చింది. అరియనా ఫ్యాన్స్ దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    కాగా బిగ్ బాస్ సీజన్ 4లో అరియనా పాల్గొంది. ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ గా పేరుతెచ్చుకుంది. ముక్కుసూటితనం, పోరాడే తత్త్వం అరియనాకు అభిమానులను తెచ్చిపెట్టాయి. అరియనా ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ఉంది. ఫైనల్ కి వెళ్లిన అరియనా టాప్ 4తో సరిపెట్టుకుంది. ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలిచాడు. అఖిల్ సార్థక్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ షోతో అరియనా మంచి పాపులారిటీ రాబట్టింది.

    ఇంస్టాగ్రామ్ లో అరియనా తరచుగా పోస్ట్స్ పెడుతూ ఉంటుంది. ఆమె హాట్ ఫోటో షూట్స్ వైరల్ అవుతుంటాయి. ఈ ఫోటోలపై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ఆ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరియనాతో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. పచ్చి ప్రశ్నలతో పిచ్చెక్కించాడు. జిమ్ ఫిట్లో అరియనా హాట్ గా ఉండగా వర్మ ఊహించని ప్రశ్నలు అడిగాడు. వర్మ-అరియనా ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది.

    లావుగా ఉన్నావన్న నెటిజెన్… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన అరియనా!

    సెలెబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపులు చాలా కామన్. మనల్ని ఏం చేస్తారులే అనే ధైర్యంతో ఆకతాయిలు ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. బట్టలు, బాడీపై అనవసర కామెంట్స్ పోస్ట్ చేస్తారు. చాలా మంది ఈ ట్రోల్స్ ని పట్టించుకోరు. అయితే శృతి మించి వేధింపులకు గురి చేస్తే రియాక్ట్ కాక తప్పదు. బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీని ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్స్ చేసిన నెటిజన్ పై ఆమె ఫైర్ అయ్యారు. వీడియో విడుదల చేసి ఇచ్చి పడేసింది. లావుగా అయ్యావని కామెంట్స్ చేసిన నేపథ్యంలో అరియనా రియాక్ట్ అయ్యారు.