Luxury Housing In Hyderabad: దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో టాప్ 10లో నిలుస్తున్న భాగ్యనగరం తాజాగా మరో ఘనత సాధించింది. దేశంలో అత్యంత లగ్జరీ ఇళ్లు కలిగిన జాబితాలో హైదరాబాద్ నెబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే దేశంలో నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఇళ్లు కలిగిన నగరంలో హైదరాబాద్ మరో కీర్తిని సంపాదించింది. ANAROCK అనే సంస్థ దేశంలోని ఏ యే నగరాల్లో ఎన్ని లగ్జరీ ఇళ్లు కలిగి ఉన్నాయో డేటా బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..
2023 ప్రకారం ANAROCK అనే సంస్థ దేశంలోని టాప్ 7న నగరాలను లెక్కలోకి తీసుకుంది. వీటిలో హైదరాబాద్ లో అత్యంత ఎక్కువగా 14,350 లగ్జరీ హైజ్ లు ఉన్నాయి. ఈ డేటా 2018లో కేవలం 210 మాత్రమే ఆ తరువాత స్థానం ముంబైలో 7830 , న్యూ ఢిల్లీలో 3870, పూణె 1940, బెంగుళూరు 1710, కోల్ కతా 1030, చెన్నై 460 విలాసవంతమైన గృహాలు ఉన్నాయి. దేశంలోని ఆర్థిక రాజధాని ముంబై కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా విలాస వంతమైన గృహాలు ఉండడం విశేషం.
దేశ వ్యాప్తంగా మొత్తం 31,180 విలాసవంతమైన గృహాలు ఉన్నాయి. ఇందులో 14,340 హైదరాబాద్ లోనే ఉన్నాయి. అంటే దాదాపు 46 శాతం హైదరాబాద్ వాటాను కలిగి ఉంది. 2018లో ఇవి కేవలం 210 మాత్రమే. అంటే ఐదేళ్లలో అత్యధికంగా ఇక్కడ నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ తరువాత మెట్రోపాలిటన్ ముంబైలో కూడా విలాసవంతమైన గృహాలు ఉన్నాయి. దాదాపు నాలుగింట ఒక వంతు గృహాలు ఇక్కడ ఉన్నాయి.
కోవిడ్ తరువాత దేశ వ్యాప్తంగా అత్యధికంగా ఇళ్ల నిర్మాణాలు సాగాయి. వీటి నిర్మాణానికి చాలా మంది ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు విలాసవంతంగా నిర్మించుకుంటున్నారు. అంతేకాకుండా లోకేషన్ విషయంలోనూ కొనుగోలుదారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ లగ్జరీ లైఫ్ ను కోరుకుంటున్నారని ANAROCK గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ అన్నారు.