Ariana Glory: అరియనా గ్లోరీ బిగ్ బాస్ వేదికగా ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అరియనా ఫైనలిస్ట్ కావడం విశేషం. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టి పాపులారిటీ తెచ్చుకుంది. అరియనా బోల్డ్ గేమ్ ఆడేది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ జెన్యూన్ ప్లేయర్ గా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. ఒక దశలో టైటిల్ విన్నర్ గా ప్రచారం పొందింది. అభిజీత్, అఖిల్, సోహైల్, అరియనా, అలేఖ్య ఫైనల్ కి వెళ్లారు. అభిజీత్-అఖిల్ విన్నర్, రన్నర్ అయ్యారు.
అరియనాకు నాలుగో స్థానం దక్కింది. అసలు అరియనాకు బిగ్ బాస్ ఆఫర్ రావడానికి రామ్ గోపాల్ వర్మ కారణం. ఎలాంటి గుర్తింపు లేని అరియనాను ఓవర్ నైట్ లో పాప్యులర్ చేశాడు. వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం అరియనాకు వచ్చింది. ఇంటర్వ్యూ మధ్యలో వర్మ… అరియనా బాడీ పై కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పాడు.
వర్మ కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. అరియనా పేరు మారుమ్రోగింది. ఇదే బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చేలా చేసింది. ఈ మధ్య అరియనా బరువు పెరిగింది. ఒకప్పుడు సన్నగా నాజూగ్గా ఉండే అమ్మడు, బొద్దుగా తయారైంది. ఈ క్రమంలో అరియనా బాడీ షేమింగ్ కి గురైంది. లావు అవుతున్నావని కామెంట్స్ చేసిన వాళ్లకు తనదైన శైలిలో ఇచ్చి పడేసింది. నా శరీరం నా ఇష్టం, మీకేంటి నొప్పి అని వీడియో విడుదల చేసింది.
బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్ దీప్ ని అరియనా సపోర్ట్ చేసింది. ఇది నచ్చని యాంటీ ఫ్యాన్స్ కొందరు ఆమెను ట్రోల్ చేశారు. అయినప్పటికీ అమర్ దీప్ కి సపోర్ట్ చేయడం ఆమె మానలేదు. మరోవైపు సోషల్ మీడియాలో అమ్మడు అరాచకాలు కొనసాగుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచిన అరియనా హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా ఆమె పింక్ స్కర్ట్ లో మైండ్ బ్లాక్ చేసింది. దుబాయ్ వీధుల్లో అరియనా ఫోటో షూట్ వైరల్ గా మారింది.
View this post on Instagram