Guntur Kaaram USA Review: సినిమానే దైవం గా భావించే హీరో మహేష్ బాబు ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికి ఆయన మాత్రం చాలా కూల్ గా ఎవ్వరినీ ఏమి అనకుండా అసలు కాంట్రవర్సీ లో ఇన్వాల్వ్ అవకుండా తన వర్క్ మాత్రమే చేసుకుంటూ పక్క విషయాల గురించి పట్టించుకోకుండా ఉండే ఒకే ఒక హీరో మహేష్ బాబు. తనకి సినిమా తప్ప ఏమి తెలీదు అందుకే సినిమా మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఇండియా లో రేపు రిలీజ్ అవుతుంది కానీ ఇవాళ్ళ ఇప్పటికే యూ ఎస్ ఏ లో ప్రీమియర్ షో స్ వేశారు.ఇక ఈ సినిమాని చూసిన అక్కడి అభిమానులు చెప్తున్న మాటలేంటి అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇక ముందుగా గుంటూరు కారం సినిమా కథ విషయానికి వస్తే కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడే తల్లి నుంచి వెరైపోయిన రమణ (మహేష్ బాబు) తనకంటూ ఒక వర్క్ చేసుకుంటూ బతుకుతాడు. అయినప్పటికీ వాళ్ల అమ్మ కి తెలియకుండానే ఆమెకు ఏ కష్టం వచ్చిన కూడా వాటన్నింటిని తీరుస్తు ఉంటాడు. ఇక ఈ క్రమంలో తల్లి కొడుకుల మధ్య అసలు ఏం జరిగింది. వీరిద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ బతకడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలతో దర్శకుడు ఈ కథ రుపొందించినట్టు గా తెలుస్తుంది.ఇక ఇందులో చాలా మంది వాళ్ల అమ్మని మోసం చేయాలని చూస్తుంటే వాళ్ల నుంచి తన తల్లి ని ఎలా కాపాడుకున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అని యూ ఎస్ ఎ జనాలు చెప్తున్నారు…
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాని చాలా నీట్ గా ప్రజెంట్ చేసినట్టు గా కూడా తెలుస్తుంది. అలాగే తన గత చిత్రాలలో ఎలాగైతే ఫ్యామిలీని ఒక కోర్ ఎమోషన్ తో సినిమాలని ఎలాగైతే నడిపించేవాడో గుంటూరు కారం సినిమాలో కూడా అదే ఎమోషన్ ని రన్ చేస్తూ సినిమాని నడిపించినట్టు గా తెలుస్తుంది…ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని చాలా కొత్తగా తీసాడని అక్కడి అభిమానులు అందరూ చెప్తున్నారు. ఇక తల్లి కొడుకుల ఎమోషన్ తో సాగే సినిమా కావడంతో తెలిసిన స్టోరీనే మళ్లీ చాలా బాగా తీసినట్టు గా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుని మాత్రం చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడట.ఆయన చెప్పిన డైలాగులు థియేటర్లో అభిమానులు అందరూ కూడా చాలా హంగామా చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగే త్రివిక్రమ్ తన పంచ్ డైలాగ్ తో మెస్మరైజ్ చేసినట్టు గా కూడా చెప్తున్నారు. ఇక అలాగే ఈ సినిమాకి ప్రధానమైన బలం ఏంటంటే మహేష్ బాబు రమ్యకృష్ణ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ అని తెలుస్తుంది. వీళ్ళ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ థియేటర్ లో బాగా వర్కౌట్ అయినట్టు గా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అని తెలుస్తుంది… అలాగే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకున్నట్టు గా అక్కడి అభిమానులు చెప్తున్నారు. ఇక అతడు, ఖలేజా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఒక భారీ సక్సెస్ అవుతుంది అంటూ యూ ఎస్ ఎ అభిమానులు చెప్పడం తో ఇక్కడున్న మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు…
ఇక నటినటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ బాబు వన్ మాన్ షో చేసినట్టు గా తెలుస్తుంది. ఆయన స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు అని కూడా చెప్తున్నారు.ఇక కుర్చీ మడత పెట్టి సాంగ్ కి అయితే ఈ సినిమాలో జనాలు ఊగిపోతున్నారు అంటా…అలాగే ప్రతి సీన్ లో కూడా మహేష్ బాబు తనని తాను ఇంతకుముందు సినిమాల్లో కంటే చాలా కొత్తగా ప్రజెంట్ చేసుకున్నట్టు గా తెలుస్తుంది. అలాగే మహేష్ చెప్పిన డైలాగ్స్ గాని, ఎమోషన్స్ సీన్స్ లో తను పండించిన నటన గాని అద్భుతంగా ఉన్నాయట. అలాగే హీరోయిన్ గా చేసిన శ్రీలీలా కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది.ఇక మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా తన పాత్ర మేరకు బాగా నటించిందట ఇక అలాగే రమ్యకృష్ణ జగపతిబాబు లాంటి నటులు కూడా ఇంతకుముందు సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా బాగా పెర్ఫామెన్స్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది.
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనీ తెలుస్తుంది. అలాగే ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కొన్ని సీన్లు మాత్రం చాలా బాగా ఎలివేట్ అయ్యాయట. ఇక మనోజ్ పరమహంస అందించిన విజువల్స్ కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక హారిక హాసిని క్రియేషన్స్ వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయని తెలుస్తుంది…
ఇక ఈ సినిమా యూ ఎస్ ఎ అభిమానులను బాగా ఆకట్టుకుంది. మరీ ఇక్కడి అభిమానులకి నచ్చిందా లేదా తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు…