Bigg Boss 9 Telugu Updates: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ ఎంత వాడివేడి వాతావరణం మధ్య నడుస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎపిసోడ్స్ ని పరిశీలిస్తే, సెలబ్రిటీలు చాలా మంచిగా అనిపించగా, ఓనర్స్ మాత్రం జనాల దృష్టిలో విలన్స్ గా మారిపోయారు. సామాన్యులు కదా, వీళ్లపై సెలబ్రిటీలు డామినేషన్ చూపిస్తారేమో అని ముందుగా అంతా అనుకున్నారు కానీ, అలాంటిదేమి జరగలేదు. కామనర్స్ ఎంత దారుణంగా వ్యవహరించారంటే, మాకు ఉన్నంత బలుపు ఈ ప్రపంచం లో ఎవరికీ లేదు అనే రేంజ్ లో వ్యవహరించారు. ఒక బాలింత గుడ్డు దొంగతనం చేసి తిన్నందుకు వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం. ఆ గుడ్డు రీజన్ తో భరణి ని ఈ వారం ఆరు మంది కామనర్స్ టార్గెట్ చేసి నామినేషన్ చేసారంటేనే అర్థం చేసుకోవచ్చు, వీళ్ళ ఎంత దారుణంగా వ్యవహరించారు అనేది.
ఇదంతా పక్కన పెడితే వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ మర్చిపోయేలా చేసింది రీతూ చౌదరి. ఎందుకంటే ఆమె అందరికంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసింది. తనకు ఎంతో ఇష్టమైన డిమోన్ పవన్ ని గెలిపించుకోవడం కోసం, తన సంచాలక్ బాధ్యతని విస్మరిస్తూ, అతను గెలిచే విధంగా రూల్స్ ని క్రియేట్ చేసి పాపం భరణి ని అన్యాయంగా టాస్క్ నుండి తప్పించారు. ఇంతలా అన్యాయం జరిగినా సంజన తప్ప ఎవ్వరూ ప్రశ్నించలేకపోయారు. ఇక ఆ టాస్క్ జరుగుతున్న సమయం లో ఓనర్స్ చేసిన అతి ని చూస్తే ఎవరికైనా కోపం రావాల్సిందే. వీళ్ళందరికీ కలిపి నాగార్జున ఈరోజు ఫుల్ కోటింగ్ ఇచ్చాడట. అంతే కాదు అన్యాయంగా హౌస్ కెప్టెన్ అయిన డిమోన్ పవన్ ని కెప్టెన్ పదవి నుండి తప్పించాడట నాగార్జున. ఇవన్నీ నేటి ఎపిసోడ్ లో హైలైట్స్ కానుంది. ముఖ్యంగా రీతూ చౌదరి కి నాగార్జున ఇచ్చిన కోటింగ్ విధానాన్ని చూసి ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో సంతృప్తి కలుగుతుందని అంటున్నారు.
Also Read: సుమన్ శెట్టి ని బూతులు తిట్టిన కమెడియన్ కృష్ణ భగవాన్.. అసలు ఏమైందంటే!
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఓనర్స్ అందరినీ టెనెంట్స్ ని చేసి అవుట్ హౌస్ కి పంపేసాడట నాగార్జున. అదే విధంగా 9 మంది టెనెంట్స్ ని ఓనర్స్ ని చేసాడట. కనీసం ఇప్పటికైనా ఆ అగ్నిపరీక్ష కామనర్స్ కి పొగరు కిందకు దిగుతుందో లేదో చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇమ్మానుయేల్ మరియు సుమన్ శెట్టి ని నాగార్జున చాలా మెచ్చుకున్నాడట. అదే విధంగా కంటెస్టెంట్స్ అందరూ కొట్టుకుంటూ ఉంటే, స్టాండ్ తీసుకోవాల్సిన సమయంలో స్టాండ్ తీసుకోకుండా, వేడుకలాగా చూస్తూ కూర్చున్న రాము రాథోడ్ కి కూడా కోటింగ్ పడిందట. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో నిండిపోయిన నేటి ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.