Donald Trump: అదేంటి ప్రపంచం మొత్తం తలకిందులవుతుంటే.. భారత ఐటీ కంపెనీల ఆర్థిక మూలాలు కదిలిపోతుంటే.. అమెరికా వెళ్లాలి అనుకునే సగటు భారతీయుడు కలగానే మిగిలిపోతుంటే.. మీరేంటి ఇలా శీర్షిక పెట్టారు.. ఇదేం శాడిజం.. ఇదే దిక్కుమాలిన జర్నలిజం.. అని తిట్టుకునేరు.. వాస్తవానికి మేం పెట్టిన శీర్షిక కరెక్టే. అందులో ఉన్న కంటెంట్ కూడా కరెక్టే… ఇంతకీ అసలు విషయం ఏంటంటే….
Welcome Back NRIs. #h1bvisa pic.twitter.com/7SzubhFm5o
— ✎ πundhati (@Polytikles) September 20, 2025
Also Read: భారతీయులారా.. ట్రంప్ కు గుణపాఠం చెప్పే రోజు వచ్చింది
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలే తిక్కలోడు. ప్రపంచం మీద ఇప్పటికే రకరకాలుగా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం స్తంభించిపోతోంది. ఇప్పటికే వాణిజ్యం నేల చూపులు చూస్తోంది. ఎగుమతులు తగ్గిపోయాయి. దిగుమతులు చేసుకోకుంటే తప్ప బతికే పరిస్థితి లేదు. మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. పరపతి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో నష్ట నివారణ చర్యలు తీసుకోవలసిన అమెరికా అధ్యక్షు.. ఏదో పిచ్చి లేసినట్టు ప్రవర్తిస్తున్నారు. అమెరికా ను మొత్తం తనకు రాసిచ్చినట్టు.. అమెరికా తన సామెత రాజ్యమైనట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. కోట్ల రూపాయల సంపాదన కరిగిపోయింది. ఈ నష్టం ఇంకా ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఎక్కడదాకా దారితీస్తుందో కూడా తెలియదు. ఈ విషయంపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు.
I support what Trump did
Here in Telugu States…going to USA has become a status symbol
My relative who cleans bathroom in USA gets more respect than a Software engineer in India in family functions
Now that PROUD NRI will be back to India
I will call him today, to know more pic.twitter.com/zX5O0UFaTM
— Uday (@CoderUday) September 20, 2025
ఇది ఇలా ఉండగానే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం కొంతమంది భారతీయులకు ఆనందాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి హెచ్1బి వీసా మీద అమెరికా వెళ్లే భారతీయులలో తెలుగు వారే అధికంగా ఉంటున్నారు. ఈ వీసా మీద అమెరికా వెళ్లడం.. అక్కడ చదువు లేదా వివిధ రకాల పనులు చేస్తున్నారు. అయితే అక్కడ ఐటీ ఉద్యోగానికి బదులుగా సౌచాలయాలలో పనిచేస్తున్నప్పటికీ.. ఇండియాకు వస్తే మాత్రం తెగ బిల్డప్ ఇస్తున్నారు. ఐటీ కంపెనీలలో పనిచేస్తున్నామని గొప్పలు పోతున్నారు. ఇటువంటి వారికి ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా శరాఘాతం లాగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం గొప్పగా ఉందంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. “మా బంధువులలో ఒకరు అమెరికా వెళ్లారు. హెచ్ వన్ బీ వీసా మీద వెళ్లిన ఆయన అక్కడ ఉద్యోగం సంపాదించలేదు. కాకపోతే బాత్రూంలలో పనిచేస్తున్నారు. ఇండియాకు వస్తే మాత్రం ఐడి కంపెనీలలో జాబ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. అటువంటి వ్యక్తులకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం గొప్పగా ఉంది. రేపే అమెరికాలో ఉన్న మా బంధువుకి ఫోన్ చేస్తాను. ట్రంప్ దెబ్బ ఎలా ఉందని అడుగుతానని” ఆ యువకుడు ట్వీట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.
Dear NRIs,
Come back India
Let’s enjoy the Amritkaal together
Let’s chant together, Modi Modi Modi#H1B #h1bvisa #h1bvisas #Trump pic.twitter.com/STgYVsRbMs— Rizwan Haider (@ItsRizwanHaider) September 20, 2025