Krishna Bhagavan vs Suman Shetty: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సుమన్ శెట్టి(Suman Shetty) ని మొదట్లో చూసి కచ్చితంగా ఇతను నామినేషన్స్ లోకి వస్తే మొదటి వారమే ఎలిమినేట్ అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన మంచితనం, అమాయకత్వాన్ని చూసి ప్రేక్షకులు ఆయనకు ఓట్లు ఒక రేంజ్ లో గుద్దేస్తున్నారు. పైగా కమెడియన్ గా మొదటి నుండి సుమన్ శెట్టి కి మంచి క్రేజ్ ఉంది. ఆయన పోషించిన కామెడీ పాత్రలకు అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కూడా. అందుకే సుమన్ శెట్టి కి ఆడియన్స్ ఓటింగ్ ఒక రేంజ్ లో పడుతుంది. అయితే సుమన్ శెట్టి లాంటి మంచోడిని, ఎవరికైనా తిట్టాలని అనిపిస్తుందా?, ఒకరిని నొప్పించే మనస్తత్వం లేని సుమన్ శెట్టి జోలికి ఎవరైనా వెళ్తారా?, కానీ ఒక టాప్ కమెడియన్ మాత్రం సుమన్ శెట్టి పై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకున్నాడట.
ఆ టాప్ కమెడియన్ మరెవరో కాదు, కృష్ణ భగవాన్. ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ భగవాన్ కి సుమన్ శెట్టి ని తిట్టాల్సిన అవసరం ఏముంటుంది?, అసలు ఏమి జరిగింది అనేది చూద్దాం. సుమన్ శెట్టి గతం లో ‘బొమ్మనా బ్రదర్స్..చందాన సిస్టర్స్’ చిత్రం లో కమెడియన్ గా చేసాడు. ఇందులో అల్లరి నరేష్, కృష్ణ భగవాన్ హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయ లో సుమన్ శెట్టి షాట్ లో భారీ డైలాగ్ ఒకటి చెప్పాల్సి ఉంటుందట. కానీ సుమన్ శెట్టి కి ఎందుకో నాలుగైదు టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. దీనికి చిరాకు పడిన సుమన్ శెట్టి, అసలు ఎక్కడి నుండి తీసుకొస్తారయ్యా ఇలాంటి వాళ్ళని అని చిరాకు పడి వెళ్ళిపోయాడట. కృష్ణ భగవాన్ అన్న ఆ మాటలు సుమన్ శెట్టి చెవిన పడ్డాయట కానీ, ఎందుకు అనవసరమైన గొడవ అని అడగలేదట.
ఇదంతా గతం లో ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా సుమన్ శెట్టి నే చెప్పుకొచ్చాడు. అయితే ఆయన అలా అనడం లో కూడా తప్పు లేదని, ఆయన స్థానం లో నేను ఉన్నా అలాగే చిరాకు పడి ఉండేవాడిని ఏమో అని సుమన్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఎందుకంటే కృష్ణ భగవాన్ కి మొదటి నుండి లెగ్ పైన్స్ చాలా బలంగా ఉండేదట. అందుకే ఎక్కువ సమయం తీసుకునే లోపు ఆయనకు కోపం వచ్చిందని, ఆయన వెర్షన్ లో ఆయన అలా చిరాకు పడడం తప్పు కాదని చెప్పుకొచ్చాడు. ఇకపోతే సుమన్ శెట్టి రాబోయే రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఎలా ఆడబోతున్నాడు అనేది చూడాలి.
