Bigg Boss 9 Telugu Tanuja: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ తో గత వారం ముగిసిపోయింది. ఆడియన్స్ ఈ సీజన్ కి కనెక్ట్ అయ్యినట్టు, ఏ సీజన్ కి కూడా అవ్వలేదు. అలా కనెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్. అయ్యో ఈ సీజన్ అప్పుడే అయిపోయిందే, ఇంకో నాలుగు వారాలు ఉండుంటే బాగుండును అని అనిపించిన సీజన్ ఇది. అయితే సీజన్ అయిపోయాక కంటెస్టెంట్స్ అందరూ ఎవరు జోన్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. విన్నర్ పవన్ కళ్యాణ్ పడాల తన కప్ పట్టుకొని తన ఊరు మొత్తం చుట్టేస్తున్నాడు. డిమోన్ పవన్ షో రూమ్ ఓపెనింగ్స్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. మరోపక్క ఇమ్మానుయేల్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి షాపింగ్ చేసుకుంటూ ఉన్నాడు. నిన్న ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేసాడు.
ఇక సంజన గల్రాని అయితే తన ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తూ, మధ్యలో తన స్కూల్ ని కూడా చూసుకుంటుంది. భరణి, సుమన్ శెట్టి వంటి వారు చిల్ మూడ్ లో ఉన్నారు. ఇలా అందరూ ఎంజాయ్ చేస్తుంటే, ఈ సీజన్ లో రన్నర్ గా నిల్చిన తనూజ మాత్రం, నిన్న మొత్తం తన సమయాన్ని అనాధాశ్రమం లో గడపడానికి కేటాయించింది. అక్కడ పిల్లలతో ఆమె ఆడుతూ పాడుతూ, వాళ్లకు భోజనం పెట్టించి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ని కాసేపటి క్రితమే ఆమె టీం సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. దీన్ని చూసిన అభిమానులు మా తనూజ బంగారు తల్లి, మేము హౌస్ లో చూసిన తనూజ కి, బయట చూసిన చూసిన తనూజ కి అసలు తేడా లేదు, మా ఓట్లు వృధా అవ్వలేదు అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా వచ్చే ఆదివారం స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వబోయే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ఎపిసోడ్ ని బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ తో షూట్ చేశారు. దాదాపుగా అందరూ ఈ షూటింగ్ లో పాల్గొన్నారు, ఒక్క తనూజ తప్ప. కొన్ని రోజులు ఆమె టీవీ షోస్ కి దూరంగా తన ప్రైవేట్ స్పేస్ ని ఎంజాయ్ చేయాలనీ అనుకుంటుంది అట. అందుకే చిన్న గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిన్ననే స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘BB జోడి 2’ లో తనూజ వైల్డ్ కార్డు ఎంట్రీ గా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఈ షోలో పాల్గొనాలని అనుకోవడం లేదట. కానీ ఆమెకి ఆఫర్స్ మాత్రం వెల్లువ లాగా కురుస్తూనే ఉంది. అయితే ఈ నెల 30న కోకాపేట లో త్రెడ్స్ డిజైన్స్ అనే షోరూమ్ ఓపెనింగ్ కి రాబోతుంది తనూజ.
View this post on Instagram