Bigg Boss 9 Telugu Nominations: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) దాదాపుగా క్లైమాక్స్ కి వచ్చినట్టే. 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 10వ వారం లోకి అడుగుపెట్టింది. గత వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో మిగిలింది కేవలం 11 మంది మాత్రమే. అందులో ఆరు మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. గత రెండు మూడు వారాలుగా జరిగిన టాస్కుల కారణంగా వీళ్ళ మధ్య బోలెడన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ వారం నామినేషన్స్ టాప్ లేచిపోతుందని అంతా అనుకున్నారు. కానీ కంటెస్టెంట్స్ అందరూ సేఫ్ గేమ్ ఆదుకున్నారు. ఉదాహరణకు గత వారం తనూజ, దివ్య మధ్య ఏ రేంజ్ లో గొడవలు జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, కానీ వీళ్లిద్దరు ఈరోజు ఒకరి పై ఒకరు నామినేషన్స్ వేసుకోలేదు.
అదే విధంగా దివ్య కారణంగా కళ్యాణ్ కి చాలా పెద్ద నష్టం జరిగింది. అంతే కాకుండా కళ్యాణ్ ని దివ్య నమ్మించి మోసం కూడా చేసింది. కచ్చితంగా ఆమెని కళ్యాణ్ నామినేట్ చేస్తాడని అంతా అనుకున్నారు, కానీ అది కూడా జరగలేదు. దివ్య, కళ్యాణ్, తనూజ ఈ ముగ్గురు కూడా గౌరవ్ ని నామినేట్ చేశారు. ఇది చాలా అంటే చాలా సేఫ్ గేమ్ అనిపించింది. ఇక సుమన్ శెట్టి అయితే నిఖిల్ ని చాలా సిల్లీ పాయింట్ మీద నామినేట్ చేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే హౌస్ మేట్స్ మొత్తం కలిసి వైల్డ్ కార్డ్స్ గా మిగిలిపోయిన ఈ ఇద్దరినీ నామినేట్ చేసి బయటకు పంపేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇది చాలా అన్యాయం కదూ. అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, సేఫ్ ప్లేయర్ అనే ట్యాగ్ తో పిలవబడే భరణి, ఈరోజు తనతో క్లోజ్ గా ఉండే దివ్య ని నామినేట్ చేసాడు.
Also Read: దివ్యని నామినేట్ చేసిన భరణి..అసలైన గేమ్ మొదలు!
ఎలాంటి పాయింట్స్ మీద నామినేట్ చేసాడు అనేది తెలియదు కానీ, ఒకవేళ సరైన పాయింట్స్ తో చేసుంటే మాత్రం ఈరోజు భరణి గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఎక్కువగా గౌరవ్, నిఖిల్ ని నామినేట్ చేశారు. చివరికి డిమోన్ పవన్ కూడా గౌరవ్ ని నామినేట్ చేయడం షాక్ కి గురి చేసే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారం నామినేషన్స్ డిజాస్టర్ అనే చెప్పాలి. ఇందుకు కారణం కేవలం కంటెస్టెంట్స్ సేఫ్ గేమ్ మాత్రమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కాసేపటి క్రితమే మూడవ ప్రోమో విడుదలైంది, భరణి మరియు దివ్య మధ్య పీక్ రేంజ్ లో గొడవ జరిగినట్టుగా అనిపించింది. చూడాలి మరి ఎపిసోడ్ లో ఇదే రేంజ్ ఫైర్ ఉంటుందో లేదో అనేది.