Globetrotter Title Songమరో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ఫ్యాన్స్ తో పాటు,కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న #Globetrotter గ్లింప్స్ వీడియో విడుదల కాబోతుంది. దీనిని రాజమౌళి(SS Rajamouli) కనీవినీ ఎరుగని రేంజ్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో లక్ష మంది అభిమానుల మధ్య విడుదల చేయబోతున్నాడు. అందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. సుమారుగా వంద అడుగుల LED టీవీ ని కూడా ఏర్పాటు చేశారు మేకర్స్. చరిత్ర లో ఒక గ్లింప్స్/ టీజర్ వీడియో కోసం ఇలా వంద అడుగుల LED స్క్రీన్ ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇంతకీ ఆ గ్లింప్స్ వీడియో ఎలా ఉండబోతోంది అనేది కాసేపు పక్కన పెడితే, సోషల్ మీడియా లో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ఇదే అంటూ, ఒక ఆడియో తెగ వైరల్ గా మారింది.
‘సంచారి..సంచారి’ అంటూ ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించే రేంజ్ లో కీరవాణి తన విశ్వరూపం చూపించాడు. ఈ పాటకు ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గాత్రం అందించింది. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ల్యాగ్ లేకుండా, వినసొంపుగా కీరవాణి తన అనుభవాన్ని మొత్తం రంగరించి ఈ పాటని కంపోజ్ చేసాడు. ఆయనకు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు విమర్శలు పెద్ద ఎత్తున్న వచ్చాయి. నాటు నాటు అనే పాట రొటీన్ గానే ఉంది, అందులో ఎలాంటి స్పెషాలిటీ లేదు, ఆ పాట ప్రపంచవ్యాప్తంగా అంత వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం రామ్ చరణ్,ఎన్టీఆర్. వాళ్లకు ఇవ్వకుండా, కీరవాణి, చంద్రబోస్ లకు ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదంటూ కొంతమంది విమర్శలు చేశారు. కానీ ఈ సంచారి పాట విన్న తర్వాత కచ్చితంగా ఈసారి కీరవాణి కి రెండవ ఆస్కార్ రావడం లో ఎలాంటి అభ్యంతరం లేదంటూ చెప్తున్నారు విశ్లేషకులు.
ఇక పోతే ఈ పాట ఒరిజినల్ యేనా?, లేదంటే ఫ్యాన్ మేడ్ ఎడిట్ నా? అని ఫ్యాన్స్ లో ఒక చిన్నపాటి అనుమానం ఉంది. ఆ అనుమానం నిజమో కాదో తెలియదు కానీ, పాట మాత్రం ఆడియన్స్ కి ఒక రేంజ్ లో ఎక్కేసింది. ఇదే నిజమైన సాంగ్ అయితే ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. అయితే ఈ పాటలో మాటికొస్తే సంచారి..సంచారి అని హమ్మింగ్ వస్తుంది కాబట్టి, కచ్చితంగా టైటిల్ ‘వారణాసి’ అయ్యి ఉండదేమో అని అంటుకుంటున్నారు ఫ్యాన్స్. చాలా కాలం నుండి ఈ చిత్రానికి రాజమౌళి వారణాసి అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టైటిల్ నిజంగా అదేనా, కాదా అనేది తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే. ఇక సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ టైటిల్ సాంగ్ ని మీరు కూడా వినేయండి.
