Bigg Boss 9 Telugu Finale Voting Results: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం రోజున కనీవినీ ఎరుగని రేంజ్ లో చేయనున్నారు. ఇప్పటికే ఫినాలే కి సంబంధించిన ఓటింగ్ మొదలైంది. ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కేవలం నలుగురే. వాళ్ళు ఎవరంటే తనూజ, భరణి, ఇమ్మానుయేల్, సంజన. వీళ్ళ వల్లే ఈ సీజన్ ఒక ఫ్యామిలీ డ్రామా లాగా అనిపించడం, ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి ఈ సీజన్ ని చూడడం జరిగింది. దానివల్ల రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అయ్యింది. ఇదంతా పక్కన పెడితే పదవ వారం వరకు తనూజ కి దరిదాపుల్లో ఒక్క కంటెస్టెంట్ కూడా ఉండేవారు కాదు. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత మొత్తం మారిపోయింది. పవన్ కళ్యాణ్ తన తల్లిదండ్రుల గురించి చెప్పుకోవడం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
ఆ వారం కళ్యాణ్ కి గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అక్కడి నుండి తనూజ కి దగ్గరైన ఓటింగ్ ని సంపాదించాడు. ఇక ఆ తర్వాత చివరి కెప్టెన్సీ టాస్క్, టికెట్ టు ఫినాలే టాస్కులు గెలవడం కళ్యాణ్ కి వేరే లెవెల్ ఎలివేషన్స్ పడేలా చేసింది, ఫలితంగా ఆయన తనూజ ఓటింగ్ ని కూడా దాటేశాడు. ఇది జరిగిన తర్వాత తనూజ ఎందుకో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దూరం అవుతూ వచ్చింది. ప్రతీ సారీ గొడవలు పడడం, తన స్వార్థం కోసం బంధాలను ఉపయోగించుకొని గేమ్స్ ఆడడం, సహాయం పొందిన తర్వాత నువ్వు నాకు ఎలాంటి సహాయం చెయ్యలేదు అనడం వంటివి ఆడియన్స్ కి చిరాకు కలిగించాయి. ముఖ్యంగా నాన్న అని పిలిచే భరణి ని ఈమె గత వారం వెన్నుపోటు పొడిచిన విధానం ఆమె గ్రాఫ్ ని మరింత దిగజారిపోయేలా చేసింది. అంత పెద్ద మనిషి నోరు తెరిచి సహాయం చేస్తావా అని అడగడం, నేను చెయ్యలేను, నీకంటే నాకు ఇమ్మానుయేల్ ఎక్కువ అని మాట్లాడడం వల్ల భరణి బాగా బాధపడుతాడు.
ఇది ఫ్యామిలీ ఆడియన్స్ లో తనూజ కి నెగిటివ్ చేసింది. యూట్యూబ్ పోల్స్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ 50 శాతం కి పైగా ఓటింగ్ తో కొనసాగుతుంటే, తనూజ కేవలం 27 నుండి 30 శాతం ఓటింగ్ తో మాత్రమే కొనసాగుతుంది. వీళ్లిద్దరు టాప్ 1 ,2 స్థానాల్లో ఉన్నారు. ఇక మూడవ స్థానం లోకి డిమోన్ పవన్ వచ్చాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత వారం నుండి ఆయనకు వరుసగా పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి, నిన్న అయితే డిమోన్ కి వేరే లెవెల్ పాజిటివ్ ఎపిసోడ్ పడింది. అందుకే ఆయన మూడవ స్థానం లో, ఇమ్మానుయేల్ నాల్గవ స్థానంలో, సంజన 5వ స్థానం లో కొనసాగుతున్నట్టు సమాచారం.