Nandamuri Family Sequels: ప్రస్తుతం ఇండియా వైడ్ గా సీక్వెల్స్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీక్వెల్ గా వచ్చిన సినిమాల్లో అత్యధిక శాతం విజయాలే ఉన్నాయి. ప్రతీ హీరోకి సీక్వెల్ కలిసి రావొచ్చేమో కానీ, నందమూరి హీరోలకు మాత్రం ఈ సీక్వెల్స్ అసలు కలిసి రాలేదు. డబుల్ బొనాంజా అన్నట్టు, ఇద్దరికీ ఈ సంవత్సరం లోనే సీక్వెల్స్ ఊహించని షాక్ తగిలింది. ‘వార్ 2′(War 2 Movie) చిత్రం తో ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కి ఆడియన్స్ కెరీర్ మొత్తం మీద ఎప్పుడూ చూడనంత ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. తెలుగు వెర్షన్ లో ఈ చిత్రం కనీసం 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది అంటేనే అర్థం చీసుకూవచు, ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది. కేవలం తెలుగు లోనే కాదు, హిందీ లో కూడా అదే రేంజ్ ఫ్లాప్.
స్పై యూనివర్స్ జానర్ లో ఇప్పటి వరకు తెరకెక్కిన అన్ని సినిమాలకంటే అతి తక్కువ కలెక్షన్స్ ని రాబట్టిన చిత్రం గా ‘వార్ 2’ నిల్చింది. ఈ సినిమా ఫలితం కాసేపు పక్కన పెడితే ఈమధ్య నే విడుదలైన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ వైపు అడుగులు వేస్తోంది. ఇదంతా చూస్తుంటే 2025 వ సంవత్సరం నందమూరి ఫ్యామిలీ కి కలిసి రాలేదా?, లేకపోతే సీక్వెల్స్ కలిసి రావడం లేదా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. బాగా పరిశీలించి చూస్తే నందమూరి కుటుంబానికి సీక్వెల్స్ కలిసి రావడం లేదు అనే చెప్పాలి. గతం లో బాలయ్య(Nandamuri Balakrishna) తన సొంత నిర్మాణ సంస్థ లో తీసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని తీసాడు. ఈ సినిమా ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యింది.
ఆ సెంటిమెంట్ ‘వార్ 2’, ‘అఖండ 2’ చిత్రాలకు కూడా వర్తించి ఉండొచ్చని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘దేవర’ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని అటు కొరటాల శివ, ఇటు ఎన్టీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా అభిమానులకు క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ ని రద్దు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. అంటే ఎన్టీఆర్ సీక్వెల్ సెంటిమెంట్ కలిసి రావడం లేదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా?, లేదంటే ‘దేవర 2’ కథకు పెద్ద స్కోప్ లేదని రిజెక్ట్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది.