Bigg Boss 9 Telugu Emmanuel: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో మొదటి నుండి తెలివిగా గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఇమ్మానుయేల్ అని చెప్పొచ్చు. గేమ్స్ వచ్చినప్పుడు తెలివిగా ప్రణాళికలు వెయ్యడం లో కానీ ఇమ్మానుయేల్ ని మించిన వాళ్ళు లేరు. అందరితో ఎంతో స్నేహం గా రిలేషన్స్ ని మైంటైన్ చేస్తూనే, తన గేమ్ స్ట్రాటజీ తో ఇమ్మానుయేల్ ముందుకు వెళ్తున్న విధానం చూస్తుంటే, టైటిల్ కొట్టడమే తన టార్గెట్ అని అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఇమ్మానుయేల్ పై ఎలాంటి నెగిటివిటీ ఉండేది కాదు కానీ, మొన్న ఆదివారం ఎపిసోడ్ లో భరణి కోసం పవర్ అస్త్రా ని ఉపయోగించనప్పటి నుండి ఇమ్మానుయేల్ పై సోషల్ మీడియా లో నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. అరెరే..అదేంటి మొదటి వారం నుండి భరణి పక్కనే ఉంటూ వచ్చిన ఇమ్మానుయేల్, ఇలా వెన్నుపోటు పొడిచాడేంటి అని అంతా అనుకున్నారు.
కానీ ఇక్కడే ఇమ్మానుయేల్ తన మాస్టర్ మైండ్ ని ఉపయోగించాడు. భరణి కొన్ని కారణాల చేత తక్కువ ఓటింగ్ లోకి పడిపోయి ఉండొచ్చు. కానీ అతనికి మళ్లీ పైకి లేచి దూసుకెళ్లిపోయే సత్తా ఉంది. హౌస్ లో చూస్తే మొదటి నుండి ప్రతీ గేమ్ లోనూ భరణి తనకు అడ్డుగా ఉన్నాడు, తనకంటే సత్తా ఉన్న ఆటగాడు అని నిరూపించుకున్నాడు, మళ్లీ ఆయన్ని లోపలకు తీసుకొస్తే కచ్చితంగా తన విన్నింగ్ అవకాశాలకు గండిపడుతుంది అనే ఆలోచనతోనే తెలివిగా అతన్ని ఈ హౌస్ నుండి తప్పించాడు. ఇప్పుడు ఆయన ద్రుష్టి మొత్తం తనూజ మీదనే ఉంది. ఈ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే తనూజ తో ఇమ్మానుయేల్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరు కలిసి ఒక షో చేశారు కూడా. ఇక హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి వీళ్లిద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ వస్తున్నారు.
కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తనూజ అందరికంటే టాప్ ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో ఉంది అనే విషయం ఇమ్మానుయేల్ కి తెలిసింది. తనూజ కి నిజంగా అంత గ్రాఫ్ ఉందని ఇమ్మానుయేల్ అనుకోలేదు. దీంతో ఇక నుండి తనూజ నే తన టార్గెట్ గా చేసుకున్నాడు. ఆమెతో ఇక స్నేహం చెయ్యకూడదు, గొడవలే పెట్టుకోవాలని అనుకున్నాడు. అందుకే ఈ వారం డైరెక్ట్ గా తనూజ పై నామినేషన్ వేస్తే, ఎక్కడ ఆమెకు సానుభూతి కలిసొస్తుందో అని, పవన్ కళ్యాణ్ చేత వేయించే ప్రయత్నం చేసాడు. కానీ పవన్ కళ్యాణ్ సంజన ని నామినేట్ చేయడం తో వీళ్లిద్దరి మధ్య నిన్న గొడవ జరగడం మనమంతా చూసాము. నా వెనుక ఇంత జరుగుతుందా అని తనూజ షాక్ కి గురైంది. బాత్రూం లో దివ్య తో మాట్లాడుతూ, నన్ను నామినేట్ చేయడానికి ఇమ్ము ఇద్దరికీ పాయింట్స్ ఇచ్చాడు, అంత తప్పు నేనేం చేశా అంటుంది. అప్పుడే ఇమ్మానుయేల్ బాత్రూం దగ్గరకు వస్తాడు. తనూజ తో గొడవ పెట్టుకుంటాడు. దానికి సంబంధించిన ప్రోమో కూడా కాసేపటి క్రితమే విడుదలైంది. ఇలా ఇమ్మానుయేల్ టార్గెట్ టాప్ 5 కాదు, డైరెక్టుగా టైటిల్ అని తన అభిమానులకు, ఆడియన్స్ కి ఒక సంకేతం ఇచ్చేసాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.